కొంతమంది హీరోయిన్స్ పదేళ్ళకి పైగానే ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలను చేస్తూ స్టార్‌గా వెలుగుతుంటే కొందరు మాత్రం..ఇండస్ట్రీలో ఏం చేసినా కలిసిరాక ఎవరు పిలిస్తే వారి దగ్గరకి వెళ్ళి ఫొటో షూట్స్ అంటూ హడావుడి చేసి అసలు పని పక్కన పెట్టి కొసరు పని కానిచ్చేసుకొని వస్తున్నారు. హీరోయిన్‌గా చేసిన సినిమాలు ఫ్లాపైతే ఆ హీరోయిన్‌ను ఇంకో రకంగా వాడటానికి ఉపయోగించుకుంటారు తప్ప అవకాశాలు మాత్రం ఇవ్వరు. వీరేమో ఒక్క ఛాన్స్ వస్తే బావుండు అంటూ ఆశలు పెట్టుకొని తలుపు తెరిచిమరీ కూర్చుంటారు.
అలా ఎదురుచూస్తున్న హీరోయిన్స్‌లో ఒకరు కృతి కర్బంద. ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల నిర్మాతగా మారి చేతులు కాల్చుకున్న సినిమా బోణి. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైంది కృతి కర్బంద. సుమంత్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత అలా మొదలైంది సినిమాలో ఓ చిన్న పాత్రను చేసి ఆకట్టుకుంది. అయితే, ఇండస్ట్రీలో ఫ్లాప్ హీరోయిన్‌ను దాదాపు అందరూ దూరం పెట్టేస్తారు.
కానీ, పవన్ కళ్యాణ్ అలాంటివేవీ పట్టించుకోడు. దీనికి ఉదాహరణ శృతి హాసన్. హిందీ తమిళం తెలుగు సినిమాలలో నటించినా ఒక్క హిట్ దక్కక ఫ్లాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శృతిని ఎంతమంది వద్దన్నా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పటి వరకూ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అదే కృతి కర్బంద విషయంలోనూ మిరాకిల్‌గా జరుగుతుందనుకున్నారు.
అమ్మడు అదే ఆశలు పెట్టుకుంది. తీన్‌మార్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారుతుందని ఎంతో నమ్మకం పెట్టుకుంది. కానీ, కథ బాగోలేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా అయినా అట్టర్ ఫ్లాపవుతుంది. దాంతో కృతి కర్బంద కెరీర్ కూడా దెబ్బ తినింది. మెగా హీరో రామ్ చరణ్‌కి అక్కగా బ్రూస్ లీ సినిమాలో నటించింది. కనీసం యంగ్ హీరోలకి అక్క పాత్రలను చేస్తూ కొనసాగుతానని ఆశపడింది. తీరా చూస్తే ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాలేదు. అటు హీరోయిన్‌గా ఫెయిల్ అయి ఇటు అక్క పాత్రలు కలిసి రాక కృతి కర్బంద ఫొటో షూట్స్‌కి తప్ప దేనికి పనికిరావడం లేదు.