Moviesఏ స్టార్ హీరోకు లేని ఆ రేర్ రికార్డ్ బాల‌య్య -...

ఏ స్టార్ హీరోకు లేని ఆ రేర్ రికార్డ్ బాల‌య్య – నానిదే… ఆ రికార్డ్ ఇదే…!

టాలీవుడ్‌లో నేచుర‌ల్ స్టార్ నాని ఈ త‌రం కుర్ర హీరోల్లో విల‌క్ష‌ణ‌మైన హీరో. నాని తీస్తోన్న సినిమాలు చూస్తేనే క‌థ‌లు ఎంత డిఫ‌రెంట్‌గా, ఎంత మెచ్యూర్డ్‌గా ఉంటున్నాయో తెలుస్తోంది. ఈ త‌రం జ‌న‌రేష‌న్ హీరోల్లో ఇంత వైవిధ్య‌మైన క‌థ‌లు ఏ హీరో సినిమాల్లోనూ మ‌న‌కు క‌న‌ప‌డ‌వు. ఇక నాని న‌ట‌సింహం బాల‌కృష్ణ‌కు వీరాభిమాని… బాల‌య్య అంటే ఎంతో ఇష్టం. బాల‌య్య శ్రీరామ‌రాజ్యం సినిమాకు నాని అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌. అప్ప‌టికే నాని స‌క్సెస్ అయినా కూడా కావాల‌నే ఈ సినిమాకు అసిస్టెంట్గా ప‌నిచేశాడు.

ఇక నాని త‌న సినిమాలో బాల‌య్య అభిమానిగా కూడా క‌నిపించాడు. బాల‌య్య అన్‌స్టాప‌బుల్ ఫ‌స్ట్ సీజ‌న్లోనే నాని గెస్టుగా వ‌చ్చి సంద‌డి చేశాడు. ఈ షో ఎంత క్లిక్ అయ్యిందో చూశాం. తాను ఓ హీరోగా ఉండి.. త‌న అభిమాన హీరోగా ఉన్న బాల‌య్య సాధించిన ఓ రేర్ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్‌లో 1980వ ద‌శ‌కం ముందు సంగ‌తేమో గాని.. ఆ త‌ర్వాత త‌రం హీరోల్లో ఏ స్టార్ హీరో న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాలేదు.

అయితే క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన సంద‌ర్భాలు ఉన్నాయి. అలాగే ఒకే హీరోయిన్ న‌టించిన రెండు సినిమాలు కూడా ఒకే రోజు రిలీజ్ అవ్వ‌డం కామ‌న్‌. ఇక ఒక హీరో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసి.. అవి రెండు ఒకే రోజు రిలీజ్ అవ్వ‌డం కూడా కామ‌నే. కానీ క్రేజ్ ఉన్న ఒక హీరో సోలో హీరోగా చేసిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వ‌డం ఏ హీరోకు లేదు.

అయితే ఈ రికార్డును ఫ‌స్ట్ టైం బ్రేక్ చేశాడు నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌. బాల‌య్య న‌టించిన భారీ బ‌డ్జెట్ సినిమా నిప్పుర‌వ్వు 1993, సెప్టెంబ‌ర్ 3న రిలీజ్ అయ్యింది. బాల‌య్య యువ‌ర‌త్న ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై విజ‌య‌శాంతితో క‌లిసి ఈ సినిమా నిర్మించారు. కోదండ రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా రెండేళ్ల‌పాటు సుధీర్ఘంగా షూటింగ్ జ‌రుపుకుని.. చాలా కార‌ణాల‌తో ఆల‌స్యంగా రిలీజ్ అయ్యింది.

అయితే అదే రోజు బాల‌య్యే న‌టించిన మ‌రో సినిమా బంగారు బుల్లోడు కూడా రిలీజ్ అయ్యింది. పైగా ఆ రోజు దీపావ‌ళి కావ‌డం విశేషం. పండ‌గ రోజు ఓ స్టార్ హీరో న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వ‌డం టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే అరుదైన రికార్డుగా నిలిచిపోయింది. ఈ సినిమాకు ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌కుడు. ర‌మ్య‌కృష్ణ‌, ర‌వీనాటాండ‌న్ హీరోయిన్లు. నిప్పుర‌వ్వ బ‌డ్జెట్ ఎక్కువ అవ్వ‌డంతో ఫెయిల్యూర్ అయ్యింది. బంగారు బుల్లోడు మాత్రం సూప‌ర్ హిట్ అయ్యింది.

అలా టాలీవుడ్‌లో పేరున్న హీరో న‌టించిన ఏ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాలేదు. అయితే 2001లో శ్రీకాంత్ న‌టించిన స‌కుటుంబ స‌ప‌రివార‌స‌మేతం, తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ రెండూ ఒకే రోజు వ‌చ్చాయి. అయితే తిరుమ‌ల తిరుప‌తి సినిమాలో ముగ్గురు హీరోలు ఉంటారు. అయితే మ‌ళ్లీ చాలా యేళ్ల‌కు నేచుర‌ల్ స్టార్ నాని బాల‌య్య సినిమా క్రియేట్ చేసిన రికార్డును సాధించాడు. నాని న‌టించిన ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం, జెండా పైక‌పిరాజు రెండూ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.

Nani vs Nani now

ఈ రెండు సినిమాలు 2015, మార్చి 21న రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో జెండా పైక‌పిరాజు మాస్ సినిమా కాగా, ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం క్లాస్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాతోనే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాగా.. విజ‌య్ దేవ‌ర‌కొండకు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెట్టి స్టార్ హీరో అయ్యేందుకు పునాదులు వేసింది. అలా బాల‌య్య త‌ర్వాత ఒక హీరో సోలోగా న‌టించిన రెండు సినిమాలు మ‌ళ్లీ రిలీజ్ కావ‌డం అనేది నానితో మాత్ర‌మే జ‌రిగింది. అలా ఈ రేర్ రికార్డులు ఈ ఇద్ద‌రు హీరోల‌కు మాత్ర‌మే ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news