నైజాంలో మాత్రమే కాదు ఇటు ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్లోనూ దిల్ రాజు కింగ్‌గా ఉంటూ వస్తున్నారు. ఇక నైజాంలో అయితే రాజుది ఏకచక్రాధిపత్యం. రాజును ఢీ కొట్టే వాళ్లే లేరు. వరంగల్ శ్రీను లాంటి వాళ్లు పోటీ ఇస్తారనుకుంటే లైగర్, ఆచార్య దెబ్బతో పాతాళంలోకి వెళ్లిపోయారు. ఇక దిల్ రాజు ఎక్కువ థియేటర్లను తన గుప్పెట్లో పెట్టుకుని పెద్ద హీరోల సినిమాల పంపిణీతో పాటు రిలీజ్‌ను శాసిస్తుండడంతో ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా రాజు దయ ఉంటేనే మంచి థియేటర్లు దక్కే పరిస్థితే ఇప్పటి వరకు ఎక్కువుగా ఉంటోంది.
తనపై ఎన్ని విమర్శలు వచ్చినా రాజు మాత్రం ఆ ఏకపోకడలను వదల్లేదనే ఇప్పటి వరకు ఉన్న టాక్ ? అయితే ఇప్పుడు నైజాంలో రాజు దూకుడుకు చెక్ పెట్టేందుకు ఓ పెద్ద నిర్మాణ సంస్థ రెడీ అవుతోంది. ఆ నిర్మాణ సంస్థే మైత్రీ మూవీస్. ఇప్పుడు మైత్రీ వాళ్లు ఇద్దరు పెద్ద హీరోలతో రెండు పెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు.
అయితే ఈ రెండు సినిమాలను నైజాంలో మైత్రీ సొంతంగా పంపిణీ చేసుకుంటోంది. ఇందుకు గాను స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్టార్ట్ చేస్తోంది. ఇక నుంచి తాము కూడా నైజాంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంటామని చెపుతోంది. ఆఫీస్ కూడా ప్రారంభిస్తోంది. ఇప్పటికే మైత్రీ వాళ్లు నైజాంలో థియేటర్లను బ్లాక్ చేసే పనిలో బిజీ అయినట్టు తెలుస్తోంది. సహజంగానే ఇది దిల్ రాజులో టెన్షన్ కలిగేలా చేస్తోందని టాక్
రాజు నైజాంలో తనకు ఎవ్వరూ పోటీ రాకుండా ఎప్పటికప్పుడు ప్లాన్ వేస్తాడన్న టాక్ అయితే ఇండస్ట్రీలో ఓపెన్‌గానే ఉంది. వరంగల్ శ్రీను అయితే రాజు నియంతృత్వ చర్యలను ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఏకి పడేశాడు. అయితే ఇప్పుడు మైత్రీ లాంటి పెద్ద సంస్థ.. అందులోనూ పెద్ద హీరోలతో సినిమాలు చేస్తోన్న సంస్థ తనకు పోటీ వస్తుండడంతో దిల్ రాజు మైత్రీ సినిమాలకు థియేటర్లు ఇస్తే మళ్లీ తన ఆఫీస్ గడప తొక్కవద్దని వార్నింగ్‌లు ఇస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి.
రాజు ఓ విధంగా థియేటర్ల యాజమాన్యాలకు వార్నింగ్ లాంటిది కూడా ఇస్తున్నారని టాక్ ? ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది. సంక్రాంతికి బాలయ్య వీరసింహారెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య వస్తున్నాయి. ఇవి రెండు మైత్రీ వాళ్లవి కావడంతో వాళ్లే సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. అయితే రాజు సంక్రాంతికే తన వారసుడు సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. దీంతో మంచి థియేటర్లు అన్నీ రాజే బ్లాక్ చేసుకుంటున్నారట.
వారసుడుతో పాటు అజిత్ డబ్బింగ్ సినిమా కూడా రాజే రిలీజ్ చేస్తున్నట్టు టాక్ ? అదే జరిగితే చిరు, బాలయ్య సినిమాలకు అనుకున్న థియేటర్లు దొరకని పరిస్థితి. ఇక నైజాంలోనే ఆసియన్ వాళ్లకు కూడా ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. ఏజెంట్ సినిమా రాకపోతే తన థియేటర్లు అన్నీ మైత్రీ వాళ్లకు ఇస్తానని సునీల్ ఇప్పటికే చెప్పి ఉన్నాడని అంటున్నారు.
ఇక అటు ఉత్తరాంధ్రలోనూ దిల్ రాజు తన రెండు డబ్బింగ్ సినిమాల కోసం ఎక్కువ థియేటర్లు బ్లాక్ చేయడంతో చిరు, బాలయ్య సినిమాలకు మంచి థియేటర్ల కౌంట్ తగ్గే ఛాన్సులు ఉన్నాయి. ఏదేమైనా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మైత్రీ ఎంట్రీతో దిల్ రాజులో అప్పుడే గడబిడ అయితే మొదలైపోయింది. మరి మైత్రీ వాళ్లు సక్సెస్ అయితే రాజుకు కొంతైనా బ్రేకులు తప్పవు.