ప్రకాష్ రాజ్.. ఈ పేరు కొత్త పరిచయాలు అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈయన తెలుగులో పలు సినిమాలో ..నటించి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రకాష్ రాజ్ దాదాపు ఆరు భాషల్లో సుమారు 250 కు పైగా సినిమాల్లో నటించి విలక్షణ నటుడుగా పేరు సంపాదించుకున్నాడు . ఇప్పటిదాకా నాలుగు జాతీయ పురస్కారాలు అందుకున్న ప్రకాష్ రాజ్.. తెలుగు ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోకి తండ్రి పాత్ర అంటే ముందుగా అందరికీ గుర్తుచేది మాత్రం ప్రకాష్ రాజే.
కాగా నటుడుగా ఆయన మొదటి నటించిన చిత్రం కే బాలచందర్ డైరెక్షన్లో వచ్చిన డ్యూయెట్. ఇద్దరు చిత్రంలో ప్రకాష్ నటన కు గాను ఉత్తమ సహాయ నటుడుగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కెరియర్ మూడు పువ్వులు ఆరుకాయలుగా విజయ పరంపర దిశగా ముందుకు సాగింది. ప్రజెంట్ ప్రకాష్ రాజ్ కన్నడ ,మలయాళ, తెలుగు సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రకాష్ రాజ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పైకి మంచి వ్యక్తిలా కనిపించే ప్రకాష్ రాజ్.. డబ్బు విషయంలో మహా పిసినారట. తన ఫ్యామిలీకి తప్పిస్తే ఒక్క రూపాయి వేరే వాళ్లకు పెట్టరట. మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో కరాఖండిగా ఉంటారట.
ప్రతి రూపాయితో సహా రాబట్టుకుంటారట. ఈ క్రమంలోనే ఆయన నటించిన రంగమార్తాండ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ విషయంలో మనస్పర్ధలు కారణంగా ఇప్పటికీ ఆ సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పలేదట . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ప్రకాష్ రాజ్ భారీగానే రెమ్యూనరేషన్ అడిగారట .కృష్ణవంశీ ముందు సరే అని చెప్పి సగం డబ్బులు అడ్వాన్స్ గా ఇచ్చారట .ఆ తర్వాత మిగతా సగం డబ్బింగ్ చెప్పిన తర్వాత చెల్లిస్తానని చెప్పాడట.
అయితే సినిమా టాక్ పరంగా ఫ్లాప్ అయితే నష్టాలు వస్తాయని తన డబ్బులు కృష్ణవంశీ ఇవ్వలేడని చెప్పి ప్రకాష్ రాజ్ ముందుగానే తనకు మొత్తం డబ్బులు ఇస్తేనే డబ్బింగ్ చెప్తానని మొండిగా ఉన్నారంటూ.. సోషల్ మీడియా ఆధారంగా తెలుస్తుంది. మనకు తెలిసిందే కృష్ణవంశీ ప్రకాష్ కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అన్ని బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. కాగా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు జనాలు . కానీ ఎక్కడో ఈ సినిమా కృష్ణవంశీకి దెబ్బేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే డబ్బు కోసం ఫ్రెండ్ తో ఇలా ఉంటాడా ప్రకాష్ రాజ్ అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు జనాలు.