టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో కన్నడ, మళయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ల హవా నడుస్తోంది. తెలుగు హీరోయిన్లు తమ పరిధి దాటేందుకు ఇష్టపడరు. అందుకే వారికి అవకాశాలు తక్కువుగా వస్తూ ఉంటాయి. అయితే గత ఆరేడేళ్లలో చూస్తే మళయాళ భామల హవానే టాలీవుడ్‌లో ఎక్కువుగా కనిపిస్తోంది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు కూడా ఇక్కడ ఎక్కువ అవకాశాలు దక్కించుకున్నారు.
మళయాళ హీరోయిన్లకు అవకాశాలు ఎక్కువుగా రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాళ్లకు ఇచ్చే రెమ్యునరేషన్ తక్కువ. అక్కడ ఇండస్ట్రీ చిన్నది… అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరో సినిమాలో నటించినా ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ. అలాంటి వాళ్లకు ఇక్కడ పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు ఇవ్వడంతో పాటు అక్కడ రెమ్యునరేషన్‌తో పోలిస్తే డబుల్ రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటారు.
దీంతో పాటు నటనలో మిగిలిన భాషల హీరోయిన్లతో పోలిస్తే వీరు ఓ అడుగు ముందే ఉంటారు. ముఖ్యంగా ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్సుల్లో వీరు టాప్. పైగా మళయాళ భామలకు గొంతెమ్మ కోర్కెలు అవసరం లేదు. ఇక బాలీవుడ్ భామలు అందంగా ఉన్నా… కావాల్సినంత ఎక్స్‌పోజింగ్ చేసినా వాళ్ల పనిమనుష్యులు, ఫ్యామిలీ మెంబర్స్‌కు కూడా చార్టెర్డ్ ఫ్లైట్ టిక్కెట్లు తీయాలంటారు… వాళ్ల కుక్కలకు కూడా ఫ్లైట్ టిక్కెట్లు కావాలని డిమాండ్లు పెడుతుంటారు.
ఇక లగ్జరీ హోట్సల్లో ఓ ఫ్లోర్ అంతా కావాలని డిమాండ్ చేసిన బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఉన్నారు. మళయాళీ భామలు వీటికి దూరం. భీమ్లానాయక్ హీరోయిన్లు సంయుక్త మీనన్, నిత్యామీనన్‌కు ఇచ్చింది చాలా తక్కువ. ఇక పాత్ర డిమాండ్ చేస్తే వీరు రేప్ సీన్లలోనూ, పాత్ర పరిధికి తగ్గట్టుగా ఎక్స్‌పోజింగ్ చేసేందుకు కూడా వెనుకాడరు. ఎవరో ఎందుకు ? నిత్య గతంలో నరేష్‌తో కలిసి అత్యాచారం సీన్లలోనూ నటించింది.
ఇక అనుపమ పరమేశ్వరన్ అయితే దిల్ రాజు వారసుడు సినిమాలో లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయింది. ఈ కారణాలతోనే మనోళ్లు ఎక్కువుగా మళయాళీ భామల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు.