అది 1965. కమలాకర కామేశ్వరరావు.. దర్శకుడు. ఒక పెద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఆర్టిస్టులు అందరూ దొరికారు. అయితే.. ఎటొచ్చీ భీము డి పాత్రకు కామేశ్వరరావు ఎంపిక వివాదంలో పడింది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడుగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. భీముడి పాత్రలోనూ ఆయన నటించాలి. అది మెయిన్ క్యారెక్టర్. పైగా బలమైన కథతో సాగే క్యారెక్టర్. అదే పాండవ వనవాసం మూవీ. పాండవులు జూదంలో ఓడిపోయి.. 14 ఏళ్లు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసే కథతో ఈ సినిమాను తీయాలని అనుకున్నారు.
అయితే, లెంగ్త్ పెరిగిపోవడంతో కేవలం వనవాసం వరకే సినిమాను పరిమితం చేసి టైటిల్ మార్చుకున్నారు. ఇక.. ఈ సినిమాలో భీముడిగా ఎన్టీఆర్ నటించేందుకు రెడీ అయ్యారు. అయితే.. భీముడు అంటే.. బలంగా,..బలిష్టంగా ఉండడమే కాకుండా చూపరులకు కూడా.. చూడగానే భీముడు అని అనిపించేలా ఉండాలి. కానీ, రామారావును చూస్తే అలా ఉండేవారు కాదు.
సో.. సినిమాలో భీముడిగా రామారావ్ నటిస్తున్నాడని ప్రచారం రాగానే అందరూ షాక్. పైగా ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ను కేవలం శ్రీకృష్ణుడుగా మాత్రమే చూసిన జనాలకు భీముడిగా ఆస్వాదిస్తారా? అనే సందేహం.
దీంతో చాలా మంది ఈ విషయంలో దర్శకుడు కామేశ్వరరావుకు.. ఎన్టీఆర్‌ను కావాలంటే.. వేరే పాత్రకు వాడుకో భీముడిగా వద్దు! అని సలహాలు ఇచ్చా రు. కానీ, కామేశ్వరరావుపై ఉన్న నమ్మకం.. ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానం సినిమాను ముందుకు తీసుకువెళ్లాయి.
సినిమా మొత్తం భీముడి చుట్టూ తిరుగుతుంది. భీముడి పాత్రధారి అయిన ఎన్టీఆర్ పైకి పీలగా ఉండేసరికి కెమెరా మ్యాజిక్కులు చేసి కొన్ని కొన్ని సీన్లలో ఆయన లావుగా ఉన్నట్టు చిత్రీకరించారు. అదే సమయంలో నడక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి సినిమా విడుదలై సూపర్ హిట్ సాధించింది. దీనిలోని పాటలు.. పద్యాలు కూడా ఇప్పటికీ జనాల నోళ్లపై నానుతూనే ఉన్నాయి. అందుకే.. ఫట్ అన్నవారు కూడా తర్వాత మెచ్చుకున్నారు.