జంబలకిడి పంబ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆమని. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. ఈ చిత్రం తర్వాత చేసిన మిస్టర్ పెళ్ళాం కూడా ఎంతో పెద్ద హిట్ అయ్యింది. ఇక ఆమని పుట్టి పెరిగింది బెంగుళూరులో అయినా ఆమె ఎక్కువగా తమిళ్ – తెలుగు సినిమాల్లో నటించింది. తెలుగులో ఎక్కువగా అరవింద్ స్వామి, మమ్ముట్టి, నాగార్జున, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు లాంటి హీరోలకు పెయిర్ గా నటించింది. అలాగే ఆమె కమల్ హాసన్ కి జోడిగా శుభ సంకల్పం సినిమాలో నటించింది.
ఇక ఆమె హీరోయిన్గా ఏకంగా 100 సినిమాల వరకు నటించింది. కెరీర్ కాస్త డౌన్ ఫాల్ అవుతున్న సమయంలో 2012 లో ఖాజామిడీన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఒక కూతురు కూడా ఉంది.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తన సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించిన ఆమని ప్రస్తుతం అమ్మ పాత్రలతో బిజీ గా ఉంది. ఇక భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు కు తల్లిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. బుల్లితెరపై సీరియల్స్ లో నటించిన ఆమని, హోస్ట్ గా కూడా వ్యవహరించింది.
ఇక ఆమని మేన కోడలు కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. అల్లంత దూరాన అనే సినిమాలో ఆమని కోడలు హీరోయిన్ గా నటించింది. ఆమని తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమె బాల్యం అంతా తల్లి, తమ్ముడితోనే గడించింది. ఆమని సినిమాల్లోకి రావాలని అనుకోలేదని, కానీ అవకాశం రావడంతో వచ్చేసాను అని చెప్తూ ఉంటుంది. కానీ సినిమాల్లోకి వచ్చాక మాత్రం చాల దారుణంగా మోసపోయినట్టుగా ఇటీవల ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపింది.
తన కుటుంబానికి ఎక్కువగా ఎవరు బ్యాగ్రౌండ్ లేకపోవడంతో అందరు మోసం చేశారని, తన తమ్ముడు చాలా చిన్నవాడిని, అమ్మకు చదువు లేదని, ఎన్నో లక్షలు సంపాదిస్తున్న కూడా తాను ఎప్పుడు సినిమాలతో బిజీ గా ఉండేదాన్ని అని ఆమని తెలిపింది. తాను సంపాదించినా డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఎక్కువ మేనేజర్లను, ఇండస్ట్రీ వారిని నమ్మి మోసపోయినట్టుగా తెలిపింది.
తన సొంత మేనేజర్ చెప్పింది గుడ్డిగా నమ్మేసి నేడు కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కోల్పోయినట్టు కూడా తెలిపింది. పోయిన ఆస్తుల గురించి బాధ పడకుండా ఉన్నదాన్ని కాపాడుకోవాలని అన్ని తెలిసి అర్ధం చేసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని తెలిపింది. ఇక పోయిన ఆస్థి విలువ కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని, కానీ ఆ దేవుడి దయ వల్ల ఈ రోజు మంచి స్థాయిలో ఉన్నట్టు ఆమని తెలిపింది. ప్రస్తుతం ఆమని అర డజన్ సినిమాలతో పాటు పలు సీరియల్స్ ఉన్నాయి.