ఇప్పుడు ఇదే విషయం సినిమా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంత కాలంగా సమంత పేరే ఎక్కడా వినపడడం లేదు. ఆమె నటిస్తోన్న రెండు సినిమాలో యశోద, శాకుంతలం అదిగో రిలీజ్ ఇదిగో రిలీజ్ అంటున్నారే తప్పా వాటి ఊసే రావడం లేదు. ఆమె విదేశాలకు వెళ్లి వచ్చారు. అలా రెండు నెలలు గడచిపోయాయి. ఇప్పుడు సమంత హైదరాబాద్‌లో కూడా లేదనే అంటున్నారు. అయితే కొద్ది నెలలుగా ఓ వార్త అయితే బాగా వైరల్ అవుతోంది. సమంత స్కిన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతోందని.. ఆ ట్రీట్‌మెంట్ కోసమే ఆమె అమెరికా వెళ్లారని అంటున్నారు.
అంతకు ముందు కూడా ఆమె పూజలతో పాటు కొన్ని హోమాలు కూడా చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ స్కిన్ ప్రాబ్లమ్ నుంచి బయట పడేందుకు ఆయుర్వేద వైద్యం కూడా చేయించుకున్నట్టు ప్రచారం జరిగింది. ఏదేమైనా సమంత హెల్త్ విషయంలో మొత్తానికి ఏదో జరుగుతుందన్న సందేహాలు అయితే చాలా మందికి కలుగుతున్నాయి. ఆమె చేస్తోన్న రెండు సినిమాలు యశోద, శాకుంతలం రెండూ అలాగే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఇప్పటికే రిలీజ్ అవ్వాలి.. యశోద డేట్ ఇవ్వలేదు.. ఇంకా డబ్బింగ్ పెండింగ్‌లో ఉందంటున్నారు.
తాజా అప్‌డేట్ ప్రకారం సమంత కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు చెపుతున్నారు. ఇటీవల వరుస ఇబ్బందులతో ఆమె మానసికంగా కుంగిపోయిందని.. కాస్త మానసిక ప్రశాంతత కోసమే ఆమె అక్కడకు వెళ్లినట్టుగా చెపుతున్నారు. ఏదేమైనా చైతుతో విడాకుల తర్వాత వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన సమంత ఇప్పుడు సడెన్‌గా డౌల్ అయిపోవడంతో అందరిలోనూ చాలా సందేహాలు నెలకొన్నాయి. ఆమె ఈ నెల 10న అక్కడ నుంచి వచ్చిన తర్వాత డబ్బింగ్ చెపితేనే ఆల్ ఈజ్ వెల్ అనుకోవాల్సిందే..!