అల్లు అరవింద్ ఇటీవలే అల్లు, మెగా కుటుంబాల మధ్య వృత్తిపరమైన పోటీయే తప్పా… ఎప్పటకీ ఈ రెండు కుటుంబాలు ఒక్కటే అని క్లారిటీ ఇచ్చారు. అంతా బాగానే ఉంది. ఇద్దరు సొంత అన్నదమ్ముల మధ్యే బేధాభిప్రాయాలు ఉంటాయి… తర్వాత కలిసిపోతూ ఉంటారు. అరవింద్ చెప్పిన ఈ వృత్తి పరమైన పోటీయే ఎంతో కొంత స్పర్థలకు దారి తీస్తుందా ? అల్లు, మెగా కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ పైకి చేతులు కలిసినట్టే ఉన్నా.. లోపల మాత్రం ఎంతో కొంత గ్యాప్‌గా కనిపిస్తోందా ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
ఒక్కటి మాత్రం నిజం.. ముందు నుంచి బన్నీ మెగా కాంపౌండ్‌కు దూరం జరిగే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఏఏ ( అల్లు అర్జున్) ఆర్మీ అన్నది సపరేట్‌గా వచ్చేసింది. రుద్రమదేవి సినిమా ఫంక్షన్లో ఫ్యాన్స్ పవన్ గురించి మాట్లాడమని కేకలు వేస్తుంటే బన్నీ చెప్పను బ్రదర్ అనడం దగ్గర నుంచే ఈ గ్యాప్, చీలిక స్పష్టంగా వచ్చేసింది. ఆ ఒక్కసారి మాత్రమే కాదు.. తర్వాత కూడా బన్నీ మెగాభిమానులు, పవన్ అభిమానులను కాస్త రెచ్చగొట్టేలా మాట్లాడారని వారు ఆరోపిస్తున్నారు.
అయితే బన్నీ మనసులో వాదన మరోలా ఉందన్నది ఇండస్ట్రీ టాక్ ? మా తాతే చిరంజీవి కంటే ముందు కదా… చిరు కన్నా ముందే ఇండస్ట్రీలోకి వచ్చిన తాత అల్లు రామలింగయ్య చిరంజీవిని కావాలని కోరుకునే మా మేనత్తను ఇచ్చారు కదా ? అన్న భావనలో ఉన్నారని.. అందుకే మా తాత వల్లే చిరు రావడం.. ఆ తర్వాత ఆయన ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోకి రావడం జరిగిందన్న ఫీలింగ్ బన్నీలో ఉందట.
అయితే మెగా కాంపౌండ్ వాదన మరోలా ఉంది. అల్లు రామలింగయ్య వల్లే చిరు మెగాస్టార్ అయితే మరి.. రామలింగయ్య తన కొడుకు అల్లు అరవింద్‌ను కూడా స్టార్‌ను చేసుకునేవాడు కదా ? చిరు కేవలం స్వయంకృషితో ఎదిగాడని అంటున్నారు. అల్లు రామలింగయ్య సపోర్ట్ ఉండబట్టే చిరు ఈ రోజు నిలదొక్కుకుని స్టార్ అయ్యాడన్న భావన బన్నీలో బలంగా ఉందట… ఇటు మెగాభిమానుల ప్రశ్న ఏంటంటే బన్నీ అన్నది నిజం అయితే మరి అల్లు అరవింద్ ఎందుకు స్టార్ హీరో కాలేదన్నదే.
అయితే ఒక్కటి మాత్రం నిజం అట. అల్లు రామలింగయ్య తన అల్లుడు చిరంజీవి చేసే సినిమాలు ఎక్కడా ఆగకుండా తెరవెనక ఫైనాన్స్ అందేలా చేయడంలో మాత్రం తనవంతుగా సాయం చేశారట. చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేయడం.. అవి రిలీజ్ కావడం.. ఇలా వరుసగా సినిమాలు చేయడానికి ఓ ఫైనాన్స్ సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా డబ్బులు ఇప్పించేలా చేసేవారట. ఆ సినిమా రిలీజ్‌కు ముందు తాము ఫైనాన్ష్ చేసిన అమౌంట్ తీసుకునేవారట.
ఈ సాయం వరకు రామలింగయ్య చేసేవారు. అయితే చిరంజీవి తన అసామాన్యమైన నటన, డ్యాన్సులు, మాస్ ప్రేక్షకులను ఊపేయడం లాంటి కారణాలతో చిరు మెగాస్టార్ అయ్యాడు. బన్నీ తీరుతో రామ్‌చరణ్ కూడా సంయమనం కూడా పాటిస్తూ రావడంతో పాటు ఒకటి రెండు సార్లు చెప్పి చూశాడని.. అయినా ఉపయోగం లేకపోవడంతో వదిలేశాడని అంటున్నారు. ఏదేమైనా అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య మా.. మీ అన్న గ్యాప్‌తో పాటు బన్నీ, చెర్రీ మధ్య వృత్తిపరమైన పోటీ వల్లే ఎంతైనా గ్యాప్ వచ్చేసిందనే అంటున్నారు.