గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ యమ వైరల్ గా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరోసారి ప్రేమలో పడ్డాడని ..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని ..కోలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి. దీంతో తెలుగులోను ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ న్యూస్ తెలుగులో కూడా స్ప్రెడ్ అయింది .
మనకు తెలిసింది తమిళ్ హీరో విశాల్ ..ఈ మధ్యకాలంలో కంటెంట్ బేస్ మూవీ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. ప్రస్తుతం మార్క్ ఆంటోనీ అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్న విశాల్ త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న అభినయను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
మనకు తెలిసిందే అభినయ తెలుగులో కూడా సినిమాలో నటించింది . అభినయకి వినికిడి లోపం. మాటలు కూడా రావు . చాలామంది స్టార్ హీరోలకు చెల్లిగా, అక్కగా ఇతర కీలకపాత్రలో నటిస్తూ ఆకట్టుకునింది. కాగా మార్క్ ఆంటోనీ సినిమాలో ఆయనకు భార్యగా నటిస్తుంది. దీంతో విశాల్-అభినయ మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ..ఈ క్రమంలోనే వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు అన్న న్యూస్ కోలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అయితే కొద్దిసేపటి క్రితం ఈ న్యూస్ పై అభినయ స్పందించింది. “రీల్ లైఫ్‌లో భార్యగా నటిస్తే రియల్ లైఫ్‌లో వైఫ్‌గా మారుతారా? “అంటూ ప్రశ్నించింది అభినయ. ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది.