మనకు తెలిసిందే ప్రెసెంట్ రష్మిక మందన్నా మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది . వరుస సినిమాలతో బిజీగా కాల్ షీట్లు బుక్ చేసుకున్న రష్మిక ..ఫుల్ స్ట్రెస్ గా ఫీలి అయ్యి.. మాల్దీవ్స్ కి వెళ్ళినట్లు తెలుస్తుంది. రీసెంట్గా మాల్దీవ్స్ కి వెళ్లడానికి ముంబై ఎయిర్ పోర్ట్లో ఫోటోకి ఫోజులిచ్చింది . ఈ క్రమంలోని అక్కడే విజయ్ దేవరకొండ కనిపించడం వీళ్ళ మధ్యలో లవ్ ఉంది అని చెప్పడానికి మరో కారణంగా నిలిచింది . సినీ ఇండస్ట్రీలో రష్మిక మందన్నా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య ఏదో ఉంది అంటూ పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఇద్దరు కలిసి గీతాగోవిందం అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి . దీంతో వీళ్ళిద్దరూ జోడి ఆకట్టుకునే విధంగా ఉంది అంటూ జనాలు చెప్పుకొచ్చారు . ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో ఏకంగా లిప్ కిస్ పెట్టుకుంటూ సినీ ఇండస్ట్రీని షేక్ చేశారు. సినిమా పెద్దగా హిట్ అవ్వనప్పటికీ వీళ్ళ లిప్ కిస్ మాత్రం హీట్ అయింది. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ బయట కూడా డిన్నర్ డేట్ లో కనిపించడం తో అభిమానులు వీళ్ళ మధ్యలో అంటూ ఫిక్స్ అయిపోయారు. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ఒకే టైంలో రావడం సోషల్ మీడియాలో ఆ పిక్స్ వైరల్ గా మారాయి.
అయితే మాల్దీవ్స్ కి వెళ్లిన ఈ రీల్ రొమాంటిక్ కపుల్ వేరు వేరుగా ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేసుకుంటూ కొత్త ఊపునిస్తున్నారు. అయితే మాల్ దీవ్స్ కి వెళ్లేముందే బాలీవుడ్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన సంచలన కామెంట్స్ చేసింది. ఆమె నటించిన గుడ్ బై సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది . ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ విజయ్ దేవరకొండ గురించి పాజిటివ్ కామెంట్స్ చేసింది . “విజయ్ దేవరకొండ నాకు చాలా క్లోజ్. నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మా మధ్య దాపరికాలు ఉండవు. మేమిద్దరం అన్ని విషయాలు మాట్లాడుకుంటాం . మేము బిగినింగ్ లో విజయవంతమైన చిత్రాల్లో కలిసిన నటించం.
విజయ్ నాకు ఎప్పటికీ క్లోజ్ గానే ఉంటాడు. నా మంచి కోరుకునే వాళ్లలో విజయ్ కూడా ఒకరు” అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ కామెంట్స్ చేసిన 24 గంటలు కాకముందే ఇద్దరు ముంబై ఎయిఎ పోర్ట్లో కనిపించడం కొత్త డౌట్ లకి తావిస్తున్నట్లు ఉంది. ఏది ఏమైనా సరే పెళ్ళికి ముందు ఈ జంట రొమాంటిక్ మూడు ని ఎంజాయ్ చేస్తున్నారు అంటున్నారు జనాలు. మరి చూడాలి ఈ విషయంపై రష్మిక విజయ్ ఎలా స్పందిస్తుందో..?