సినిమాలు, రాజకీయాలు అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారిగా ఓటీపీపై పంజా విసిరారు. ఆయన వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షో గత ఏడాది ప్రసారమైన సంగతి తెలిసిందే. తెలుగు బుల్లితెరపై ఇప్పటివరకు ఎన్నో టాక్ షోలు, ఎన్నో ఇంటర్వ్యూలు వచ్చాయి. ఆహా ఓటీటీ లోను సమంత, రానా లాంటి క్రేజ్ ఉన్న కుర్ర నటీనటులు కూడా టాక్ షోలు చేశారు. అయితే వీటన్నింటినీ తోసి బాలయ్య అనుస్టాపబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలయ్యతో ఆహా టాక్ షో అనగానే తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కడా లేని క్యూరియాసిటీ నెలకొంది.
గత ఏడాది తొలి ఎపిసోడ్లో నటుడు మోహన్ బాబును బాలయ్య ఇంటర్వ్యూ చేశారు. ఓటిటి ప్లాట్ఫామ్లో ఇప్పటివరకు ఎవ్వరికీ లేని విధంగా నాలుగు మిలియన్లకు పైగా లైకులతో అన్‌స్టాపబుల్ తొలి సీజన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఫస్ట్ సీజన్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) ఇండియా టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 9.7 పాయింట్లతో ఈ షో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ షో తర్వాతే బాలీవుడ్లో కపిల్‌శర్మ నిర్వహిస్తోన్న ది కపిల్ శర్మ షో ఉంది.
ఆ షోకు 7.8 పాయింట్లు దక్కాయి. అందాల భామ ఐశ్వర్యారాయ్ నిర్వహించిన అమెజాన్ ఫ్యాషన్ అప్ షో 4.9 పాయింట్లతో పదో స్థానంలో నిలిచింది. ఇలా దేశంలోనే ఎంతో మంది ప్రముఖులు ఎన్ని టాక్ షోలు చేసినా బాలయ్య షో దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. ఇది ఎంత అరుదైన రికార్డు చూస్తేనే తెలుస్తోంది. ఇక ఫస్ట్ సీజన్లో ఎపిసోడ్లు మొత్తం కలిపి 40 కోట్ల నిమిషాలతో అత్యధికంగా వీక్షించబడిన షో గా రికార్డు క్రియేట్ చేసింది.
ఇక అన్‌స్టాపబుల్ రెండో సీజన్ ప్రోమోనే ఎవ్వరూ టచ్ చేయలేని రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్‌కు చంద్రబాబు, లోకేష్ వచ్చారు. ప్రోమో రిలీజ్ అయిన 170 నిమిషాల్లోనే 11 లక్షల వ్యూస్ వ్యూస్ సాధించి టాక్ షోలకు అమ్మ మొగుడు అయ్యింది. అలాగే ఈ ప్రోమో తొలి 13 గంటలు పూర్తయ్యే సరికి 2.67 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. ఏదేమైనా ఓటీటీలో బాలయ్య అరంగ్రేటం చేయడమే అందరికి పెద్ద షాక్ అనిపించింది. ఇక ఇప్పుడు ఈ టాక్ షో దేశంలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో ఆయన అభిమానులకే కాదు.. తెలుగు బుల్లితెర, సినీ అభిమానులందరికి ఎంతో జోష్‌గా ఉంది.