MoviesUnstoppable 2: షోకి బాలకృష్ణ తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా.. మొత్తం...

Unstoppable 2: షోకి బాలకృష్ణ తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా.. మొత్తం వాళ్లకే..శభాష్ బాలయ్య..!!

ఐ యాం ఆల్ రౌండర్.. ఐ కెన్ డు ఎనీ థింగ్ ..అంటూ నందమూరి నటసింహం బాలయ్య తనలోని సరికొత్త టాలెంట్ ను జనాలకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. అప్పటివరకు బాలయ్యలోని నటుడిని, నిర్మాతని,, కొన్నిసార్లు డైరెక్టర్గా మాత్రమే చూసిన అభిమానులకు ఒక్కసారిగా షేడ్స్ అన్ని మార్చేస్తూ సరదా సరదాగా కబుర్లు చెప్పే యాంకర్ గా మారిపోయాడు. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ షాక్ అయిపోయింది.

నందమూరి బాలయ్యలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ జనాలు ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఏ రంగంలో అయినా ఎలాంటి పనులకైనా నేనే నెంబర్ వన్ అంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ షో కోసం బాలయ్య హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే . కాగా సీజన్ వన్ బ్లాక్ బస్టర్ అవడంతో ప్రజెంట్ సీజన్ 2 చేస్తున్నారు. ఈ షో కి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు ..ఆయన అల్లుడు లోకేష్ గెస్ట్లుగా రాగా.. రెండో ఎపిసోడ్ కి టాలీవుడ్ యంగ్ హీరోస్ విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ గెస్ట్లుగా వచ్చారు.

కాగా ప్రజెంట్ సోషల్ మీడియాలో అన్ స్టాపబుల్ 2 కోసం బాలయ్య తీసుకుంటున్న పారితోషకం వైరల్ గా మారింది . కాగా ఈ షో కోసం బాలయ్య 12 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మొదటి సీజన్ కి ఆరు కోట్లు తీసుకున్న బాలయ్య.. రెండో సీజన్ కి ఆరు కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ 12 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా బాలయ్య తన సొంత ఖర్చులకు వాడుకోవటం లేదట. మొత్తం బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ కి ఫండ్ గా ఇచ్చేస్తున్నారట. ఏది ఏమైనా సరే ఇలాంటి భారీ మొత్తంలో సహాయం చేయాలంటే మన బాలయ్య తర్వాతే మిగతా హీరోలు. దీంతో అందరు ఒక్కసారిగా జై బాలయ్య అంటున్నారు .మరి మనము చెబుదామా జై బాలయ్య.. జై జై బాలయ్య.. జై బాలయ్య.. జై జై బాలయ్య..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news