Moviesపూజాహెగ్డేకు ఇలాంటి షాట్ గట్టిగా పడాల్సిందే.. తిక్క కుదిరిందిగా...!

పూజాహెగ్డేకు ఇలాంటి షాట్ గట్టిగా పడాల్సిందే.. తిక్క కుదిరిందిగా…!

పూజా హెగ్డే లాంటి వారికి ఇలాంటి షాట్ గట్టిగా పడాల్సిందే..! అంటున్నారు కొందరు నెటిజన్స్. మనవాళ్ళలో కొందరికి ముంబై మోడల్స్ అంటే ఎందుకనో పెద్దగా నచ్చదు. ఇక ముంబై నుంచి ఇక్కడ సెటిలైన వారూ అంతగా నచ్చరు. వారే కాదు, చెన్నై, బెంగుళూరు, కేరళ లాంటి పక్క రాష్ట్రం నుంచి దిగుమతి అయినవారూ మనవాళ్ల దగ్గర దారుణంగా ట్రోల్ అవుతూ ఉంటారు. దీనికి కారణం వారి ప్రవర్తనే. సౌత్ సినిమాలో మరీ ముఖ్యంగా మన టాలీవుడ్‌లో అవకాశం వచ్చేవరకూ ఒకలా ప్రవర్తిస్తారు.

అవకాశం ఇచ్చాక ఒకరకంగా మారిపోతారు. అదీకాక మన వాళ్ళపైనే కామెంట్స్ చేస్తారు. అందులో ఇటీవల కాలంలో బాగా ట్రోల్స్ ఎదురుకుంది అంటే పొడుగుకాళ్ళ సుందరి పూజా హెగ్డే. ఈ బెంగుళూరు భామ తెలుగులో చేసిన మొదటి రెండు సినిమాలు ఫ్లాప్‌గా మిగిలాయి. ఆ తర్వాత బాలీవుడ్ ఎగురుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా ఢమాల్ అంటూ కిందపడింది. అలాంటి సమయంలో ఏ భాష నుంచి అవకాశం ఇచ్చినవారు లేరు. మళ్ళీ మన టాలీవుడ్ మేకర్స్ హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు చేరదీసి హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చారు.

అదే డీజే ( దువ్వాడ జగన్నాథం). దిల్ రాజు ప్రొడక్షన్‌లో వచ్చిన ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. అప్పటివరకు చేసిన సినిమాలు ఫ్లాపని తెలిసి కూడా ఆమెకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కూడా దిల్ రాజు, మహర్షి..హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమాలలో ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నారు. మొదటి హిట్ మహర్షి సినిమాతో అందుకుంది. ఆ తర్వాత గురూజీ చేరదీసి అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు చేతిలో పెట్టి స్టార్ డం తెచ్చిపెట్టారు.

అలాంటి వారిని పూజా హెగ్డే కామెంట్స్ చేసి అడ్డంగా బుక్కైంది. ఇండస్ట్రీవారు, అభిమానులు, నెటిజన్స్ ఏకిపారేశారు. అప్పటి నుంచి పూజా ఎక్కడ దొరికినా వదలడం లేదు. వరుసగా రాధే శ్యామ్మ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయినా పూజా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది. లైగర్ భారీ హిట్ అనే ఓవర్ కాన్‌ఫిడెన్స్‌తో పూరి టీం జనగణమన సినిమాను మొదలుపెట్టింది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను తీసుకున్నారు. అయితే, లైగర్ డిజాస్టర్ తర్వాత జనగణమన ఆగిపోయింది. దాంతో కొందరు పూజా హెగ్డేకి ఇలాగే అవ్వాల‌ని, ఆమె తిక్క గ‌ట్టిగా కుదిరింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. పూజా లాంటి పొగరబోతు హీరోయిన్‌కి ఇలాంటి గట్టి షాట్స్ తగలాల్సిందే అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news