టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే అందరికీ కామన్ గా నచ్చే సినిమా మాత్రం ఇంద్ర . ఈ సినిమా చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాగా మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు . అంతేకాదు చిరంజీవిలోని మాస్ యాంగిల్ ని బయటపెట్టిన సినిమాగా ఇంద్ర సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాదు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలను తిరగరాసింది. సినిమా నిర్మాతలకు లాభాలు సంపాదించి పెట్టి ..బాక్స్ ఆఫీస్ వద్ద సంచల రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాలో మెగాస్టార్ నటన చూసి జనాలు ఫిదా అయిపోయారు.
2002లో రిలీజ్ అయిన ఈ సినిమాను బి గోపాల్ డైరెక్ట్ చేశారు . అంతే కాదు వైజయంతి మూవీస్ పతాకం పై శ్రీ అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు . ఇందులో హీరోయిన్లుగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే నటించారు. కాగా ఈ సినిమా షూటింగ్ టైంలో ఓ సీన్ చేసే సందర్భంలో ఇద్దరు హీరోయిన్స్ చిరంజీవి కోసం కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారట . అదేదో పగతో కాదండోయ్ సరదాగానే..
చిరంజీవితో నటించాలంటే అదృష్టం ఉండాలి అదే చిరంజీవి చేయి పట్టుకొని డాన్స్ చేయాలంటే ఎక్కడో రాసిపెట్టి ఉండాలి..ఇక చిరంజీవి చేతులతో తాళ్లి కట్టించుకోవాలంటే ఎన్నో జన్మలు ఎత్తలి. రియల్ లైఫ్ లో సురేఖా ఆ అదృష్టం దక్కించుకునేసింది. కనీసం రీల్ లైఫ్ లో అయినా అలాంటి అవకాశం దక్కించుకోవడానికి ఆర్తి అగర్వాల్ – సోనాలి బింద్రే తెగ కష్ట పడ్డారట.
నిజానికి ఈ సినిమా లాస్ట్ లో ఇంద్రసేనారెడ్డి ఒక హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలట. ఆ హీరోయిన్ ఎవరు అయ్యి ఉంటే బాగుంటుందా అంటూ డైరెక్టర్ గోపాల్ ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వెళ్లిన ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే ..నాతో పెళ్లి చేయమంటే ..నాతో పెళ్లి చేసినట్టు కధ రాయండి అంటూ ఓ రేంజ్ లో హంగామా చేసారట . అంతేకాదు అక్కడే ఉన్న చిరంజీవిని ఈ విషయంగా దండం పెట్టేసి ముఖం తిప్పుకునేసాడట. ఈ క్రమంలోనే బి గోపాల్ ఓ హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకో హీరోయిన్ ని తక్కువ చేస్తే ఇద్దరు ఫీలవుతారు అని చెప్పి అతడు ఎవర్ని చేసుకోకుండా జనాల మనుషులుగా చూపించాడు. అయితే షూటింగ్ టైంలో మాత్రం అర్తి అగర్వాల్-సోనాలి బింద్రే చిరంజీవి నా మొగుడు అంటే నా మొగుడు అంటూ సినిమా కోసం ఫైట్ చేసుకున్నారట . ఇప్పటికీ షూటింగ్ టైం లో జరిగిన సన్నివేశాలను మర్చిపోలేము అంటూ చిరంజీవి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.