Moviesటాలీవుడ్‌లో 1000 రోజులు ఆడిన సినిమాలు... ఆ రికార్డులు ఇవే...!

టాలీవుడ్‌లో 1000 రోజులు ఆడిన సినిమాలు… ఆ రికార్డులు ఇవే…!

తెలుగు సినిమాకు దాదాపుగా 7 ద‌శాబ్దాల చ‌రిత్ర ఉంది. ఈ ఏడు ద‌శాబ్దాల్లో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. 1990 – 2000వ ద‌శ‌కం వ‌ర‌కు సినిమా 100 రోజులు, 200 రోజులు ఆడితే గ్రేట్‌. అంతకు ముందు 1970 – 80వ ద‌శ‌కాల్లో ఎన్నో సినిమాలు 365 రోజుల పాటు ఆడేవి. అయితే కాలం మారుతోన్న కొద్ది టెక్నాల‌జీలో మార్పులు వ‌స్తున్నాయి. 2010 త‌ర్వాత డిజిట‌ల్ యుగం అయిపోవ‌డంతో రిలీజ్ అయ్యే సెంట‌ర్లు పెరిగిపోతున్నాయి. దీంతో 365 రోజులు, 200, 100 రోజులు క‌నుమ‌రుగు అయిపోయాయి. చివ‌ర‌కు 50 రోజుల పోస్ట‌ర్లు కూడా ప‌డ‌డం లేదు.

ఓ సినిమా వారం రోజులు ఆడితే గ్రేట్‌.. రెండో వారం కొత్త పోస్ట‌ర్ ప‌డిపోతోంది. ప్ర‌తి చిన్న సెంట‌ర్ల‌లో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండ‌డంతో ఇప్పుడు రోజులు పోయాయి. క‌లెక్ష‌న్లు… కోట్లు మాత్ర‌మే లెక్క‌ల్లోకి వ‌స్తున్నాయి. ఏ సినిమా అయినా 1000 రోజులు ఆడ‌డం చాలా గ్రేట్‌. టాలీవుడ్‌లో కూడా 1000 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. మ‌రి ఆ సినిమాలు ఏంటో ? ఆ రికార్డులు ఏంటో చూద్దాం.

టాలీవుడ్‌లో 1000 రోజులు ఆడిన సినిమాలు నాలుగు ఉన్నాయి. ఎన్టీఆర్ న‌టించిన ల‌వ‌కుశ 1000 రోజులు ఆడియ‌న తొలి సినిమా. ల‌వ‌కుశ 1963, మ‌ర్చి 29న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ఆ రోజుల్లో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఓ థియేట‌ర్లో ఏకంగా 1111 రోజులు ఆడింది. ఇది తొలి తెలుగు క‌ల‌ర్ సినిమా. ల‌వ‌కుశ సినిమా చూసేందుకు రాత్రుళ్లు థియేట‌ర్ల‌కు వెళ్లి టిక్కెట్లు దొరక్క‌పోతే రాత్రంతా అక్క‌డే ఉండి.. ఉద‌యం 6 గంట‌ల‌కు థియేట‌ర్ల ద‌గ్గ‌రే స్నానాలు చేసి టిక్కెట్లు తీసుకుని మ‌రీ సినిమా చూసి వ‌చ్చేవార‌ట‌.

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్‌బాబు – పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన పోకిరి సినిమా అప్ప‌టి వ‌ర‌కు ఉన్న తెలుగు సినిమా రికార్డులు తిర‌గ‌రాసేసింది. పోకిరి 2006 ఏప్రిల్ 28న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమా 1000 రోజులు ఆడి రికార్డుల్లోకి ఎక్కింది. ఆ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ – రాజ‌మౌళి కాంబినేష‌న్లో వ‌చ్చిన మ‌గ‌ధీర సినిమా 2009, జూలై 30న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా క‌ర్నూలులోని ఓ థియేట‌ర్లో 1000 రోజులు ఆడి పాత రికార్డుల‌ను బ్రేక్ చేసింది.

ఇక న‌ట‌సింహం బాల‌కృష్ణ కెరీర్‌కు మాంచి ఊపు ఇచ్చిన సినిమా లెజెండ్‌. 2014 ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. లెజెండ్ 2014 మార్చి 28న రిలీజ్ అయ్యింది. లెజెండ్ ప్రొద్దుటూరు, ఎమ్మిగ‌నూరులో రెండు చోట్ల 400 రోజులు ఆడింది. ఇక ప్రొద్దుటూరులో అయితే ఏకంగా 1005 రోజులు ఆడి స‌రికొత్త రికార్డు న‌మోదు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news