Moviesనమితని ఆ విషయంలో భరించలేకనే టాలీవుడ్ హీరోలు వద్దనుకున్నారా...?

నమితని ఆ విషయంలో భరించలేకనే టాలీవుడ్ హీరోలు వద్దనుకున్నారా…?

నమితని ఆ విషయంలో భరించలేకనే టాలీవుడ్ హీరోలు వద్దనుకున్నారా…? అంటే లోలోపల ఇదే టాక్ అపట్లో బాగా ప్రచారమైంది. హీరోయిన్స్ ఎప్పుడైనా 5 నుంచి 5.6 లోపే హైట్ ఉండేవారే. చాలా తక్కువమంది అంతకంటే ఎక్కువ హైట్ ఉంటారు. ఎక్కడో అనుష్క శెట్టి..నమిత..రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు ఈ రేంజ్ హైట్‌లో ఉంటారు. అయితే, వీరు అందరి సరసన నటించడానికి సెట్ కారు. సొంతం సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది నమిత.

ఫస్ట్ టైం ఈ అమ్మడిని చూసిన వారందరూ అరేబియన్ గుర్రంలా ఉందని హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అంత హైట్ ఉన్న హీరోయిన్ అంటే స్క్రీన్ మీద రొమాన్స్ చేయడానికి అందరి హీరోలకి పనికిరాదు. మొదటి సినిమా సమయంలో నమితని చూసి ఇలాంటి హీరోయిన్‌ని భరించడం చాలా కష్టమనుకున్నారు. వెంకటేష్ సరసన జెమిని చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రభాస్ సరసన బిల్లాలోనూ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ అనుష్క శెట్టితో అందాల ఆరబోతను పోటీపడి మరీ చూపించింది.

అటు నమిత ఇటు అనుష్క..మధ్యలో ప్రభాస్. సూపర్బ్ కాంబినేషన్ అనుకున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ భారీ పర్సనాలిటీ వేసుకొని బికినీ ధరించి కనపడిన సీన్స్ చూసి థియేటర్స్‌లో ఆడియన్స్, ఫ్యాన్స్ చమటలు చిందించారు. అయితే, మన టాలీవుడ్‌లో నమిత లాంటి హీరోయిన్స్ అందరు హీరోల పక్కన రొమాన్స్ చేయడానికి పనికిరారు. అందులోనూ నమిత లాంటి అరేబియన్ గుర్రం అయితే, కత్తి మీద సామే. కుర్ర హీరోల పక్కన అంటే సిల్వర్ స్క్రీన్ షాకై షేకవుతుంది.

అందుకే, నమిత అంటే మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అమ్మో అనేవారట. ఆన్ స్క్రీన్ మీద తనతో నటించడానికి ససేమిరా అంటూ రిజెక్ట్ చేశారని అప్పట్లో బాగానే టాక్ వినిపించింది. అందుకే, తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేసి సైడయింది. లేదంటే నమిత అందానికి, కాస్తో కూస్తో ఉన్న పర్ఫార్మెన్స్‌కి అనుష్క మాదిరిగా చాలా ఏళ్ళు హీరోయిన్‌గా కొనసాగేది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news