టైటిల్: గాడ్ ఫాదర్
బ్యానర్: కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్‌గుడ్ ఫిలింస్
నటీనటులు: చిరంజీవి, సల్మాన్‌ఖాన్, నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్ తదితరులు
డైలాగులు: లక్ష్మీ భూపాల
సినిమాటోగ్రఫీ: నిర్వా షా
మ్యూజిక్: థమన్
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యుసర్: వాకాడ అప్పారావు
నిర్మాతలు: రామ్‌చరణ్ – ఆర్బీ చౌదరి – ఎన్వీ ప్రసాద్
దర్శకత్వం: మోహనరాజా
పీఆర్వో: వంశీ – శేఖర్
రిలీజ్ డేట్: 05 అక్టోబర్, 2022
సెన్సార్ రిపోర్ట్ : U / A
రన్ టైం: 157 నిమిషాలు
బ్రేక్ ఈవెన్ టార్గెట్ : 92 కోట్లు
ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తక్కువ టైంలోనే మరోసారి గాడ్ ఫాదర్ రీమేక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మళయాళంలో మోహన్‌లాల్ లూసీఫర్ సినిమాకు రీమేక్‌గా గాడ్ ఫాదర్ వస్తోంది. మోహనరాజా దర్శకుడు. దసరా కానుకగా ఈ రోజు తెలుగు, మళయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్‌గుడ్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆచార్య ఎఫెక్ట్‌తో చిరు గత సినిమాలతో పోలిస్తే గాడ్ ఫాదర్‌కు అనుకున్న ప్రి రిలీజ్ బజ్ లేదు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయడం… పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా ? అన్న అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలను మించి గాడ్ ఫాదర్‌తో చిరు ఏం మ్యాజిక్ చేశాడో TL రివ్యూలో చూద్దాం.
TL స్టోరీ:
జనజాగృతి పార్టీ అధినేత, సీఎం పీకేఆర్ మరణంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఆయన తర్వాత సత్యప్రియ (నయనతార), జయ దేవ్ (సత్య దేవ్), వర్మ (మురళి శర్మ) వీళ్ళందరు తామే ముఖ్యమంత్రి అవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అసలు పార్టీని ముందుండి ఎవరు నడిపిస్తారు ? అధికారం కోసం అందరి కళ్లు ఆ కుర్చీమీదే ఉంటాయి.. ఆ టైంలో బ్రహ్మ ( చిరంజీవి) ఎంట్రీ ఇస్తాడు. వచ్చీ రావడంతోనే అందరి అంచనాలు తారుమారు చేస్తూ రాజకీయం చేస్తాడు… ఆ కుర్చీపై చెడ్డవాళ్ల కన్ను పడకుండా చూస్తాడు ? చివరకు ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కథ ఏంటన్నదే ఈ సినిమ స్టోరీ.
TL విశ్లేషణ :
చిరంజీవికి ఈ సినిమాలో పాటలు, హీరోయిన్ ఉండరు. చాలా కొత్త క్యారెక్టర్ దక్కింది. సినిమా అంతా తానే ముందుండి నడిపించాడు. చిరు క్యారెక్టర్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగా సెట్ అయ్యాయి. చిరుకు ఇది అసలు సిసలు కం బ్యాక్ మూవీ. నయనతార కూడా తన పాత్రలో బాగా ఒదిగిపోయింది. నయనతార తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సత్యదేవ్ స్క్రీన్ ప్రెజెన్సీ అదిరిపోయింది. మెయిన్ విలన్‌గా సత్యదేవ్ ఇరగదీశాడు. ఈ పాత్ర సత్యదేవ్ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్.
చాలా కాలం తర్వాత కెమేరా ముందుకు వచ్చిన పూరికి జర్నలిస్టుగా మంచి రోల్ దక్కింది. సల్మాన్ ఖాన్ పాత్రకి థియేటర్స్ లో విజిల్స్ ఖాయం అయినా ఇంకా డెప్త్ ఉండేలా చూసుకోవాల్సింది. సినిమా ఫస్ట్ హాఫ్ మంచి స్పీడ్‌తోనే మూవ్ అవుతుంది. ఫస్టాఫ్ అంతా మెగాస్టార్ హీరోయిజం కనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర సస్పెన్స్ క్యారీ చేసి సినిమాను ముందుకు నడిపిస్తాడు. సెకండాఫ్‌లో మాత్రం సీన్లు, ట్విస్టులు రివీల్ అవ్వడం, సల్మాన్‌ఖాన్ ఎంట్రీ ఇవ్వడం.. క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
థమన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి అతిపెద్ద అసెట్. పాటలు పక్కన పెడితే నేపథ్య సంగీతం బాగా సెట్ అయింది. సినిమా అయిపోయాక వచ్చిన మార్ మార్ కూడా అభిమానుల్లో మంచి జోష్ నింపింది. సినిమాటోగ్రాఫర్ కూడా సినిమాకి మంచి కలర్ ఫుల్ విజువల్స్ ఇచ్చాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే 2.37 గంటల సినిమా కావడంతో కొన్ని సీన్లు ట్రిమ్ చేయాల్సింది. కొన్ని సీన్లు బోర్ కొట్టించేశాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
మోహనరాజా డైరెక్షన్ కట్స్ :
డైరెక్టర్ మోహన్ రాజా కథను చాలా బాగా నెరేట్ చేసుకుంటూ వచ్చాడు. రీమేక్ అయినా కథ కొంత డిఫరెంట్‌గా ఉండేలా ట్రై చేశారు. సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా మార్చిన తీరు బాగుంది. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగానే ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మోహనరాజా బాగా చిత్రీకరించారు. అయితే సెకండాఫ్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది.
ఫైనల్‌గా…
చిరంజీవికి గాడ్ ఫాదర్ కం బ్యాక్ సినిమా. చిరు నటనతో సినిమా రేంజ్ పెంచగా… నయనతార, సల్మాన్‌ఖాన్ సినిమాకు ప్లస్ అయ్యారు. అయితే స్లో నెరేషన్, బోరింగ్ సీన్లు సినిమాకు మైనస్ అయ్యాయి. ఓవరాల్‌గా పొలిటికల్ డ్రామాగా వచ్చిన గాడ్ ఫాదర్ ఆకట్టుకుంటుంది. మెగా ఫ్యాన్స్‌కు బిర్యానీ మీల్స్… కామన్ ఆడియెన్స్‌కు మామూలు మీల్స్.
ఫైనల్ పంచ్ : బాస్ ఈజ్ బ్యాక్
గాడ్ ఫాదర్ TL రేటింగ్ : 3 / 5