కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివ తల్లిదండ్రులయ్యారు . ఈ విషయం ఎవరో చెప్పలేదు. స్వయాన ఈ జంటే అఫీషియల్ గా ప్రకటించింది. విగ్నేష్ శివన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ పేజీ ద్వారా..” నేను నయనతార అమ్మ అప్ప అయ్యాం. మాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. వాళ్లకి మీ ఆశీర్వాదం కావాలి . లైఫ్ లో కొత్త రకమైన ఫీలింగ్ ను ఎంజాయ్ చేస్తున్నాం. మీ ప్రేమ ఎప్పటికీ మా కుటుంబం పై ఉంటుందని ఆశిస్తున్నాం”.. అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. అంతే దెబ్బకు నయన్ అభిమానులు నవ్వాలో ఏడవాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు.
పోనీ ఆలియాభట్ల పెళ్ళికి ముందే తప్పు చేశారనుకుంటే నిన్న మొన్నటి వరకు కనిపించిన పిక్స్ లోను నయనతారకు బేబీ బంప్ లేదు. పెళ్లి తర్వాత కంటిన్యూ గా నయనతార మనకు కనిపిస్తూనే ఉంది. ఎక్కడ కూడా ఆ లక్షణాలు కనిపించలేదు. సరోగసి ద్వార వీళ్లు పేరంట్స్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. అయితే, ఈ జంట ఈరోజే ఈ విషయం ప్రకటించడానికి ఓ స్పెషల్ సెంటిమెంట్ ఉందట. ఈ రోజు మూడు గంటల ఏడు నిమిషాలకు నయనతార విగ్నేశ్ తల్లిదండ్రులు అయ్యారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈరోజునే వాళ్లు తల్లిదండ్రులు అవ్వాలని డాక్టర్స్ కి చెప్పి మరి సరోగసి చేస్తున్న ఆవిడకు సిజరిన్ చేయించారట.
మనకు తెలిసిందే నయనతార విగ్నేష్ జీవితాలలో 9 అని నెంబర్ కు చాలా పెద్ద సెంటిమెంటే ఉంది . నయనతార మొదట కలుసుకున్న డేట్ 9 తో ముడిపడి ఉందని.. ఆ తర్వాత వీళ్ళ నిశ్చితార్థం కూడా తొమ్మిదో తారీఖున జరిగిందని ..అంతెందుకు వీళ్ళ పెళ్లి జరిగింది కూడా జూన్ 9నే.. ఈ క్రమంలోని వాళ్ళ లైఫ్ లో గుర్తుండిపోయే ఈ స్వీట్ మెమోరీ ని కూడా 9 అనే నెంబర్ తో ముడి పెట్టాలని సరోగసి చేస్తున్న ఆవిడకు మంచి ముహూర్తం చూసుకుని మరి సిజరిన్ చేయించారట.
అందుకే అభిమానులకు కూడా పండితులు చెప్పిన టైం ప్రకారం అఫిషియల్ గా అనౌన్స్ చేసారట. దీంతో సినిమా వాళ్ళు ఇలాంటి సెంటిమెంట్లు కూడా నమ్ముతారా అంటూ జనాల ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా సరే నయనతార తల్లి అయినందుకు ఆనందపడాలో పెళ్లికి ముందే ఇలాంటి పనులు చేసినందుకు సిగ్గుపడాలో తెలియక అల్లాడిపోతున్నారు ఫ్యాన్స్..?