ఇండస్ట్రీలో ఒక హీరో చేయాలని అనుకున్న సినిమా మరో హీరో చేసి హిట్టు లేదా ప్లాపులు కొడుతూ ఉంటారు. తాము వదులుకున్న కథ హిట్ అయితే బ్యాడ్‌లక్ అనుకుంటారు… అదే ప్లాప్ అయితే తమ జడ్జ్‌మెంట్ కరక్టే అని ఖుషీగా ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా ఇలా రిజెక్ట్ చేసిన ప్లాప్ సినిమాలు ఉన్నాయి. టెంపర్‌కు ముందు వరకు ఎన్టీఆర్ కథలు ఎంచుకోవడంలో చేసిన పొరపాట్లతోనే ఎదురు దెబ్బలు తిన్నాడు.
టెంపర్ సినిమా నుంచి ఎన్టీఆర్ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు… అందుకే ఎన్టీఆర్‌కు వరుసగా హిట్లు పడుతున్నాయి. ఇక ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ప్లాపు సినిమాల లిస్ట్ ఏంటి ? అందులో నటించిన హీరోలు ఎవరో చూద్దాం.
లైగర్ :
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు. టెంపర్‌కు ముందు పూరి, ఎన్టీఆర్ ఇద్దరూ కష్టాల్లో ఉన్నారు. ఈ సినిమాతో పూరి తనకు హిట్ ఇవ్వడంతో ఎన్టీఆర్‌కు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే పూరి వెంటనే ఎన్టీఆర్‌ను బుట్టలో పెట్టేసి మరో సినిమా చేయాలని బాక్సింగ్ నేపథ్యంలో కథ రాసుకున్న లైగర్ కథను ఎన్టీఆర్‌కు చెప్పాడు. అయితే ఎన్టీఆర్‌కు కథ ఏదో తేడా కొట్టడంతో రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఆ కథ అలాగే ఉంచుకుని చివరకు విజయ్‌తో లైగర్ చేస్తే ఘోరమైన డిజాస్టర్ అయ్యింది.
నా పేరు సూర్య :
అల్లు అర్జున్ చేసిన నా పేరు సూర్య.ఈ సినిమా ఆఫర్ మొదట ఎన్టీఆర్ వద్దకే వచ్చింది. టెంపర్ స్టోరీ రాసింది వక్కంతం వంశీయే. అప్పుడే మంచి కథ ఉంటే రెడీ చేసుకో.. డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని ఎన్టీఆర్ వంశీకి చెప్పారు. అయితే వంశీ రాసుకున్న ఈ కథ ఎన్టీఆర్‌కు ఎక్కడో నచ్చలేదు. చివరకు అది అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
బ్రహ్మోత్సవం :
సూపర్ హిట్లతో ఫామ్‌లో ఉన్న మహేష్ దూకుడుకు బ్రహ్మోత్సవం పెద్ద బ్రేక్ వేసింది. అసలు ఈ సినిమాతో మహేష్ పరువు అంతా పోయింది. సీతమ్మ వాకిట్లో సినిమా హిట్ ఇచ్చాడన్న ఒక్క నమ్మకంతో కథ కూడా పూర్తిగా వినకుండానే మహేష్ ఈ సినిమాను ఓకే చేశాడు. మహేష్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఈ కథను శ్రీకాంత్ ముందుగా ఎన్టీఆర్‌కు వినిపించగా రిజెక్ట్ చేశాడు.
శ్రీనివాస కళ్యాణం :
నితిన్ – రాశీఖన్నా జంటగా వచ్చిన శ్రీనివాస కళ్యాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా కథను ముందు ఎన్టీఆర్‌కు వినిపిస్తే బోరింగ్‌గా ఉందని రిజెక్ట్ చేశాడు. చివరకు ఆ సినిమా కూడా ప్లాప్ అయ్యింది.