నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది . గత రాత్రి సాయంత్రం బాలకృష్ణ కెరియర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్బికె 107 టైటిల్ రిలీజ్ చేశారు . ఈ సినిమాకు “వీరసింహారెడ్డి” అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్ . మనకు తెలిసిందే బాలకృష్ణ సెంటిమెంట్ ప్రకారం సింహ , రెడ్డి అనే పదాలు టైటిల్ లో ఉంటే కచ్చితంగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది .
ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాల పేర్లు చూసుకుంటే ఆ విషయం మనకు క్లియర్గా అర్థం అవుతుంది . కాగా ఈ సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ పెట్టడంతో కచ్చితంగా డబుల్ బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్లో తన 107వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే . ఇన్నాళ్లు ఈ సినిమాకి ఏ పేరు పెడతారా అని వెయిట్ చేసిన జనాలకు గోపీచంద్ మలినేని పవర్ఫుల్ పేరును పెట్టి ఫాన్స్ ను ఫుల్ ఖుషి చేశాడు.
ఈ క్రమంలోని సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు . ఆశ్చర్యమేంటంటే ఇప్పటివరకు టాలీవుడ్ చరిత్రలోనే ఇలాంటి ఈవెంట్ జరగలేదు. ఫస్ట్ టైం టైటిల్ లాంచ్ కు వేడుక నిర్వహించడం బాలయ్య ఖాతాలోనే పడింది . అభిమానులు సమక్షంలో పేరును ప్రకటించారు . కొండారెడ్డి బురుజు ఇందుకు వేదిక అయింది. కాగా గోపీచంద్ మల్లినేని ఖాతాలో బోలెడు హిట్స్ ఉన్నాయి . క్రాక్ విజయం అనంతరం దర్శకుడు తీస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అభిమానులను ఓ రేంజ్ లో ఊపేసింది . “భయం అనే పదం నా బయోడేటాలోనే లేదు రా బోసడీకే” అన్న డైలాగ్ నందమూరి అభిమానులను బాగా ఆకట్టుకుంది. అఖండ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన తమన్ నే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు . ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.