సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో స్ట్రగుల్ అయి ఈరోజు స్టార్ డైరెక్టర్‌గా, స్టార్ కొరియోగ్రాఫర్‌గా అగ్ర స్థానంలో ఉన్నారు రాఘవ లారెన్స్. జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకొని మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ముఠామేస్త్రి సినిమాలో ఎక్కడో గ్రూపులో నాలుగో వరుసలో డాన్స్ చేస్తూ కనిపించిన రాఘవ లారెన్స్‌ను గమనించి మంచి భవిష్యత్ ఉందని పసిగట్టి హిట్లర్ సినిమాలో పాటలకి కొరియోగ్రఫీ అందించే అవకాశం ఇచ్చారు.
అలా అందుకున్న అవకాశంతో రాఘవ అతికొద్దికాలంలోనే క్రేజీ కొరియోగ్రాఫర్‌గా మారాడు. స్టార్ హీరోలందరూ పిలిచి మరీ తమ సినిమాలలోని సాంగ్స్‌కు కొరియోగ్రఫీ అందించమని అవకాశం ఇచ్చారు. ఏ హీరోకి తగ్గట్టుగా స్టెప్స్ కంపోజ్ చేసినప్పటికీ ఆ పాటలలో రాఘవ లారెన్స్ స్పెషాలిటీ మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఇంట్రో సాంగ్ అంటే దాదాపు ఆ అవకాశం రాఘవకే దక్కేది.
అంతగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం..రాఘవేంద్ర స్వామీ భక్తుడు..పేదలకి కాదనకుండా సహాయం చేయడం..ఇలా తనలో ఉన్న గొప్ప విశేషాలు అంచలంచలుగా ఎదగడానికి కారణం అయ్యాయి. మాస్ సినిమాతో దర్శకుడిగా మారిన రాఘవ కాంచన సిరీస్‌తో వరుసగా హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు ఏకంగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. రాఘవ లారెన్స్ తెలుగు, తమిళంలో క్రేజీ డైరెక్టర్.
హర్రర్ సినిమాలకు లారెన్స్ కేరాఫ్. కొరియోగ్రాఫర్‌గా కంటే కూడా దర్శకుడిగానే ఎప్పువ పాపులారిటీని తెచ్చుకున్నారు. ఇన్నేళ్ళ నుంచి ఉన్నా పెద్దగా కాంట్రవర్సీలకి పోనీ రాఘవ హీరోయిన్ రాయ్ లక్ష్మీ విషయంలో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన దర్శకత్వంలో వచ్చిన ముని సిరీస్ కాంచన సినిమాలో రాయ్ లక్ష్మీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయం నుంచి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందట. అందుకే, చిరంజీవి నటించిన ఖైదీ 150 మూవీలో రత్తాలు రత్తాలు పాటకి ఆమెను పట్టుపట్టి తీసుకున్నారని అప్పట్లో గట్టిగానే చెప్పుకున్నారు.
ముందు వేరే అమ్మాయితో సగం సాంగ్ కంప్లీట్ చేశారు. కానీ, రాఘవకి, ఆ అమ్మాయికి చెడింది. దాంతో వెంటనే రాయ్ లక్ష్మీని దింపి మళ్ళి సాంగ్ మొత్తం తీశారు. ఒకరకంగా చెప్పాలంటే రాయ్ లక్ష్మీ కోసమే ఆ అమ్మాయిని తప్పించారని చెప్పుకున్నారు. వీరిద్దరి మధ్య కూడా ఏదో ఉందని ఇప్పటికీ కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తుంటాయి. కానీ, ఎప్పుడూ అటు రాఘవ గానీ, ఇటు రాయ్ లక్ష్మీ గానీ స్పందించింది లేదు.