Moviesకమిట్‌మెంట్ ఇవ్వనందుకు ఈ తెలుగు హీరోయిన్ల‌కు ఇంత టార్చ‌రా...!

కమిట్‌మెంట్ ఇవ్వనందుకు ఈ తెలుగు హీరోయిన్ల‌కు ఇంత టార్చ‌రా…!

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా మిగతా సౌత్ సినిమా ఇండస్ట్రీలలో అలాగే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనూ హీరోయిన్స్‌ను హాట్‌గా చూపించడం..రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించమని దర్శకులు చెప్పడం..కెరీర్ కోసం స్టార్ హీరోయిన్స్ కూడా దీనికి తలూపడం తెలిసిందే. అన్నిటికీ సిద్ధంగా ఉన్న వారే అంతంత మాత్రంగా కెరీర్ లీడ్ చేస్తున్నారు. ఇవి చేయమూ..అవి చేయమూ అనేవాళ్ళని అలా తీసి పక్కన పెడుతున్నారు.

ఒకప్పుడు అందాల ఆరబోత అంటే బొడ్డు, నడుము, ఎద అందాల వరకే. కానీ, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సీరియల్ కిస్సర్‌గా ఒక కొత్త ఒవరడి తీసుకువచ్చిన హీరో ఇమ్రాన్ హష్మీని మన హీరోలు దర్శకులు ఫాలో అయ్యారు. దీనికి తగ్గట్టుగానే హీరోయిన్స్‌తో రొమాంటిక్ సీన్స్, ముద్దులు..బీచ్‌లలో బికినీలు వగైరా వన్నీ సిల్వర్ స్క్రీన్ మీద చూపించేస్తున్నారు. తనూశ్రీదత్తా, బిపాసా బసు, కంగనా రనౌత్ లాంటి హాట్ బ్యూటీలను చూపించి మీరు ఇలా కనిపించాలని మన మేకర్స్ కోరుతున్నారు.

దాంతో ఇక్కడ కూడా మితి మీరిన ఘాటు సన్నివేశాలు సినిమాలలో కనిపిస్తున్నాయి. అయితే, ఇలాంటి మసాలా సన్నివేశాలు సౌత్‌లో చూసింది మలయాళం సినిమాలలోనే. కానీ, తెలుగుతో పాటు మిగతా భాషలలో కూడా ఇవి రెగ్యులర్ అయ్యాయి. మాధవీలత, ఈషారెబ్బ, బాబు బాగా బిజీ లాంటి సినిమాలో నటించిన తెలుగమ్మాయి సుప్రియా ఐసోలా లాంటి తెలుగమ్మాయిలు కూడా రొమాంటిక్ సీన్స్‌లో నటించాల్సి వచ్చింది. అయినా కూడా మన వాళ్ళు కాదనలేదు.

ఈ ముగ్గురే కాదు, మిగతా తెలుగమ్మాయిలు కూడా అందాల ఆరబోతకి సై అన్నవారే. వారిలో రాశీ లాంటి సీనియర్ నటి కూడా ఉన్నారు. కానీ, ఇంకా ఏదో కావాలి. ఆ ఇంకా ఏదో అంటే హీరోలతో సీరియల్ కిస్సింగ్ సీన్స్‌లో మతి పోగొట్టాలి. బికినీ వేది అదరగొట్టాలి. కానీ, మన తెలుగమ్మాయిలెవరూ ఇలాంటి సీన్స్‌కి ఒప్పుకోవడం లేదు. గ్లామర్‌గా కనిపించడానికి ఓ లెవల్ వరకూ ఒకే అంటున్నారు. కానీ, మరికొన్ని చీకటి వ్యవహారాల విషయంలో ససేమీరా అంటుంటడంతో తొక్కేస్తున్నారు. మనవాళ్ళు కూడా ఇదే బాధను వెల్లబుచ్చుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news