Moviesత్రివిక్రమ్ కి ఉన్న ఆ రెండు చెడ్డ అలవాట్లు ఇవే.. వెనక...

త్రివిక్రమ్ కి ఉన్న ఆ రెండు చెడ్డ అలవాట్లు ఇవే.. వెనక పరిగెత్తి మరి..అలా చేస్తాడట..!!

మనిషి తప్పు చేయడం సర్వసాధారణం. ఎలాంటి మనిషి అయినా సరే ఒకానోక టైం లో చెడు వ్యసనాలకు అలవాటు పడటం.. తప్పు చేయడం జనరల్ గా జరుగుతుంటాయి. కానీ అది తప్పు అని తెలుసుకొని మానేసి మంచి మార్గంలో వెళ్లేవాడే నిజమైన మనిషి. ప్రజెంట్ ఇప్పుడు అలాంటి ఓ మంచి పని చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మాటల మాంత్రికుడిగా సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలను డైరెక్ట్ చేస్తూ స్టోరీ రైటర్ గా రచయితగా మంచి పేరు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా గతంలో ఈయన తెరకెక్కించిన సినిమాలను మనం చూసినట్లయితే ప్రతి సినిమా ఓ అద్భుత కావ్యంలా అనిపిస్తుంది.

“నువ్వు నాకు నచ్చావ్” సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైలాగులు కారణమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అంతెందుకు తరుణ్ నటించిన “నువ్వే నువ్వే” సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 20 ఏళ్లవుతుంది. అయితే ఈ సినిమాపై ఒక్కరంటే ఒక్కరు ఇప్పటివరకు కూడా నెగిటివ్ కంప్లైంట్ ఇవ్వలేదు .నెగిటివ్ రివ్యూ ఇవ్వలేదు. నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వలేదు. అంతలా ప్రతి పాయింట్ను క్షుణ్ణంగా పరిశీలించి తనదైన స్టైల్ లో తెరకెక్కించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు .

రీసెంట్గా ఈ సినిమా 20 ఏళ్ల కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సినిమాకు సంబంధించిన నటులు గెట్ టు గెదర్ అయ్యారు . సినిమాను కలిసి చూసి ఎంజాయ్ చేశారు . ఈ క్రమంలోని త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడుతూ..” ఒకప్పటి త్రివిక్రమ్ కి ఇప్పటికి త్రివిక్రమ్ కి చాలా తేడా ఉంది .ఒకప్పుడు త్రివిక్రమ్ కి కోపం ఎక్కువ . ఆవేశం ఎక్కువ. ఏదైనా తనకు నచ్చినట్లు జరగకపోతే అరుస్తాడు. కొట్టేస్తాడు. షూటింగ్స్ స్పాట్ లో చాలామంది నటులను నాకు తగ్గ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకపోతే పరిగెత్తించి మరీ కొట్టేవాడిని . అది తప్పు అని ఆ టైంలో నాకు తెలియలేదు.

వయసుకు మీద పడిపోవడంతో ఇప్పుడు నాకు అర్థం అవుతుంది అలా చేయడం తప్పు అని . అంతేకాదు నేను స్మోకింగ్ చేస్తాను ..డ్రింకింగ్ చేస్తాను ..ఇప్పుడు నాకు అర్థమైంది దాని వల్ల వచ్చే ప్రాబ్లంస్ ఏంటో.. అందుకే ప్రజెంట్ అవి మానేసి హెల్త్ గురించి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను . నా తప్పులను సరిదిద్దుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మాటలు వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news