సీని రంగంలో అనేక పాత్రలు చేసిన,.. అన్నగారికి బాలివుడ్‌పై ఆకర్షణ ఎక్కువగా ఉండేది. బాలీవుడ్‌లో నేరుగా ఒక సినిమా తీయాలని అనుకునేవారు. అయితే.. అది సాధ్యం కాలేదు. అన్నగారి మార్కెట్ అంతా కూడా.. దక్షిణాదికే పరిమితం అని.. ఆయన వల్ల బాలీవుడ్ మార్కెట్ సాధ్యం కాదని.. ఒక ప్రచారం తెరమీదకి వచ్చింది. వాస్తవానికి ఇది నిజం కాదు. ఎందుకంటే.. అప్పటికే అన్నగారు.. నటించిన ఆరాధన సినిమాను.. హిందీలోకి కూడా.. డబ్ చేసి.. విడుదల చేశారు. ఇది కాసుల వర్షం కురిపించింది. అయినా. కూడా ఆయనను నిర్మాతలు నమ్మలేదు.
దీనికి కారణం.. ఏంటనే విషయంపై.. తేల్చుకునేందుకు అన్నగారు.. ఓ పదిరోజుల పాటు బొంబాయిలో నే మకాం వేశారు. అప్పట్లోహిందీ రంగాన్ని.. ఏలిన అగ్ర హీరోయిన్ వహీదా రెహమాన్ .. తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టు గుర్తించారు. అప్పట్లో కొందరు అగ్రహీరోలు, హీరోయిన్లే.. సినిరంగాన్ని శాసించేవారు. తెలుగులో అన్నగారు.. అక్కినేని ఇలానే వ్యవహరించారు. వారు నటించిన సినిమాలు వంద రోజులు పక్కా అనే మాట వచ్చింది.
దీంతో తాము చెప్పినట్టు వినాలనే పోకడలు కొన్నాళ్లు సాగాయి. అయితే.. అగ్ర దర్శకులు మాత్రం కొన్ని సార్లు వినేవారు కాదు. అయితే.. బాలీవుడ్‌లో మాత్రం.. పూర్తిగా.. అగ్ర హీరోలు.. హీరోయిన్లకే.. పెద్ద తాంబాలం. వారు చెప్పిందే వేదం. వారు చేసిందే శాసనం.. అన్నట్టుగా పరిస్థితి ఉండేది. దీంతో హీరోయిన్ల హవా కూడా.. చాలా సంవత్సరాల పాటు సాగింది.ఈ క్రమంలో వహీదా.. అన్నగారికి వ్యతిరేకంగా ప్రచారం చేసేవారట.
ఆయన వల్ల మార్కెట్ ఉండదని.. తాను నటించనని.. చెప్పేవారట. అంతేకాదు.. అది తెలుగు ఫేస్.. ఇక్కడ ఎవరు చూస్తారు? అని కూడా.. వ్యతిరేక ప్రచారం చేసేవారట. దీనిపై అన్నగారు.. ఒకింత సీరియస్ అయ్యారు. అసలు.. ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలిస్తే.. తెలుగులో వహీదా నటించిన చిత్రం రోజులు మారాయి. ఒక్క ఐటం సాంగ్‌లో ఆమె నటించారు. ఏరు వాక సాగారో.. అనే పాటకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తర్వాత.. ఆమెకు హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి.
అయితే.. దీనిని అన్నగారు విభేదించారు. సావిత్రి, అంజలి వంటి మెరుపుల్లాంటి తారలు మనకుండగా.. ఎక్కడివారితోనో సినిమాలు తీయడం ఎందుకు? అని చెప్పేసరికి.. ఆమెకు ఇచ్చిన అడ్వాన్సులు కూడా నిర్మాతలు తీసేసుకున్నారు. దీంతో అప్పుడు నేరుగా ముంబై వెళ్లిన వహీదా అక్కడ మెరిసారు. అదే సమయంలో ఎన్టీఆర్‌పై ఆమె అకారణంగా విషం వెళ్లగక్కారట.