Moviesహీరోయిన్ నిఖిత కోసం త‌న భార్య‌నే కాల్చాల‌నుకున్న హీరో... ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు...

హీరోయిన్ నిఖిత కోసం త‌న భార్య‌నే కాల్చాల‌నుకున్న హీరో… ఇండ‌స్ట్రీలో ప్ర‌కంప‌న‌లు రేపిన ఇష్యూ ఇదే…!

అప్పుడెప్పుడో ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ పెద్ద కుమారుడు ఆర్య‌న్ రాజేష్ హీరోగా ప‌రిచ‌యం అయిన‌ హాయ్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన నికిత గుర్తుంది కదా..! అదేనండి హీరోయిన్ నికిత తుక్రాల్. నితిన్ మూవీ సంబరంతో తొలి హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించిన కూడా తగినంత స్టార్ డం అయితే రాలేదు. నాగార్జున నటించిన డాన్ సినిమాలో రాఘవ లారెన్స్ కి జోడీగా నటించి బిజీ అవ్వాలని భావించిన ఆ సినిమా అంతగా ఆడలేదు. నిఖిత తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా తమిళ్, కన్నడ ఇండస్ట్రీ లలో మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.

ఆమె నటించిన సినిమాల కన్నా కాంట్రవర్సీలతోనే ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఇక క‌న్న‌డ‌ హీరో దర్శన్ తో ఎఫైర్ గురించి నిఖిత ఏకంగా కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయ్యింది. ఈ బ్యాన్ జరగడానికి ముందు దర్శన్‌తో ఓ సినిమాలో నిఖిత హీరోయిన్ గా నటిస్తున్న సమయం అది. అయితే షూటింగ్ మొదలవ్వగానే వీరిద్దరి మధ్య చనువు పెరగడంతో ఇద్దరు రిలేషన్ లోకి వెళ్లిపోయారు. అయితే దర్శన్ కి అప్పటికే విజయ లక్ష్మితో పెళ్లయింది. దాంతో విజయలక్ష్మికి – దర్శన్ కి మధ్య నిఖిత విషయంలో గొడవలు మొదలయ్యాయి.

అవి ఎక్కడివరకు వెళ్లాయంటే ఏకంగా తాగిన మత్తులో తన భార్య పై దర్శన్ గన్ను పెట్టేవరకు వెళ్ళింది.
దాంతో విజయలక్ష్మి దర్శన్ పై పోలీస్ స్టేషన్లో వేధింపుల కేసు పెట్టింది. ఆ కేసులో దర్శన్ కి 14 రోజుల పాటు రిమాండ్ కూడా కోర్ట్ విధించింది. అయితే ఈ విషయం తెలియగానే కన్నడ ఇండస్ట్రీ అంతా ఉడికిపోయింది. ఇక ఈ విషయంలో కన్నడ మూవీ ఇండస్ట్రీ నిఖిత పై చర్యలు తీసుకుంది. ఆమెను మూడేళ్ళ పాటు కన్నడ సినిమాల్లో నటించకుండా ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయం తెలియగానే నిఖిత సైతం ఎమోషనల్ గా బాగా డౌన్ అయ్యింది. అంతే కాదు బ్లడ్ ప్రెజర్ వాల్యూస్ కూడా తగ్గడం తో హాస్పిటల్ లో కూడా జాయిన్ అయ్యింది. నిఖితకు మాత్రం కన్నడ నటీనటుల మద్దతు దొరికింది. దర్శన్ కి అతడి భార్యకు ఏదైనా విషయం ఉంటే అది వారి పర్సనల్ విషయం. దానికి నిఖిత ను బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కొంత మంది నటీనటులు ర్యాలీ కూడా తీశారు. కన్నడ ఇండస్ట్రీ లో పెద్ద నటులైన గిరీష్ కర్నాడ్, గిరీష్ కాసరవల్లి వంటి వారు బహిరంగంగా నిఖితకు మద్దతు పలికారు.

గిరీష్ కర్నాడ్ మాట్లాడుతూ ఈ చర్య పూర్తిగా పిచ్చితనం, ప్యూర్ గా మేల్ ఇగోతో తీసుకున్న నిర్ణయం. దర్శన్ తప్పుకి నిఖితను ఎలా ? బలి చేస్తారు.. అని కుండ బద్దలు కొట్టారు. ఇక ఈ గొడవ మరి పెద్దది అయితే లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండటం తో కన్నడ పరిశ్రమ పెద్దలు నిఖిత పై ఉన్న బ్యాన్ ని మూడు రోజుల తరువాత ఎత్తేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news