టాలీవుడ్లో లవర్‌బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో తరుణ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవడం.. అలాగే తరుణ్ అమ్మా నాన్నలిద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో హీరోగా మారేందుకు తరుణ్ అంతగా కష్టపడలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన స్క్రిప్ట్‌తో కె.విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వే కావాలి తరుణ్ హీరోగా పరిచయమైన సినిమా. రీచా హీరోయిన్గా పరిచయమైంది. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు ఈ సినిమాను నిర్మించారు.
నాగార్జున నటించిన హలో బ్రదర్ లాంటి మ్యూజికల్ హిట్ తర్వాత మళ్ళీ కోటీ అందించిన మ్యూజికల్ హిట్ నువ్వే కావాలి. రామోజీ రావు ఈ చిత్రాన్ని చాలా తక్కువ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించగా ఊహించని లాభాలు వచ్చాయి. అలా తరుణ్ హీరోగా నటించిన మొదటి సినిమా ఇండస్ట్రీ హిట్ కావడంతో ఇక వరుసగా అవకాశాలు అందుకున్నాడు.
ఇదే సమయంలో ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం నిర్మాణంలో తరుణ్ హీరోగా నటించే అవకాశమూ అందుకున్నాడు. ఆ సినిమానే నీ మనసు నాకు తెలుసు. ఈ సినిమా ద్వారా త్రిష టాలీవుడ్‌కి పరిచయమైంది. అప్పటికే ఇష్టం సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన శ్రియ శరణ్ ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటించింది. అయితే, తరుణ్ – శ్రియల మధ్య ఈ సినిమాతో మంచి బాండింగ్ ఏర్పడింది.
ఇద్దరూ చెట్టా పట్టాలు వేసుకొని రాత్రిళ్ళు బాగానే శికార్లు కొట్టేవారని అప్పట్లో మీడియాలో బాగానే వార్తలు వచ్చాయి. వాస్తవానికి దివంగత నటి ఆర్తి అగర్వాల్‌తో తరుణ్ రిలేషన్లో ఉన్నాడని ప్రచారం జరిగింది. అయితే, ఇటు శ్రియను కూడా బాగానే వాడాడని టాక్ వినిపించింది. దీనికి కారణం తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే సినిమాకు శ్రియను హీరోయిన్గా రికమెండ్ చేయడమేనట. అప్పటివరకూ రచయితగా అద్భుతమైన సక్సెస్‌లు అందుకున్న త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు.
అందుకే, త్రివిక్రమ్.. తరుణ్ సలహా మేరకే శ్రియను హీరోయిన్గా తీసుకున్నారని చెప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారని అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీ వర్గాలలోనూ బాగా హాట్ టాపిక్ అయింది. ఏదేమైనా తరుణ్ మాత్రం తన తోటి హీరోయిన్స్‌తో బాగానే రొమాన్స్ చేసేవాడనేది మాత్రం అందరూ చెప్పుకుంటున్నదే.