టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై నాగ్ గత సినిమాలతో పోలిస్తే మంచి అంచనాలే ఉన్నాయి. నాగ్‌కు జోడీగా సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఇప్పటికే ప్రీమియర్లు కంప్లీట్ అయిన ఈ సినిమా ఫస్టాఫ్ చూస్తే సినిమా ఎంట్రీయే అరేబియా ఎడారిలో ఓ అదిరే యాక్షన్ సీక్వెన్స్ తో నాగ్ ఎంట్రీతో సినిమా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. వెంటనే హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఉంటుంది.
నాగ్ మేనకోడలుతో పాటు ఆమె ఫ్రెండ్స్‌ను ఓ విలన్ కిడ్నాప్ చేసే ప్రయత్నాలు, నాగ్ యాక్షన్‌లోకి దిగడం బాగుంది. కిడ్నాప్ తర్వాత వచ్చే యాక్షన్ సీన్లు డైలాగ్ లేకుండా సింపుల్‌గా సూపర్బ్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్‌తో పాటు విలన్ ఎవరో రివీల్ అయ్యే సీన్లు బాగున్నాయి. ఇక ఫస్టాఫ్ వరకు సినిమా ఓకే. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్లు, నాగ్ నటన హైలెట్.
నాగ్ చాలా రోజుల తర్వాత ది బెస్ట్ ఇచ్చాడు. సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. నాగ్‌పై ఇంట్రస్టింగ్ ఎలివేషన్ తర్వాత ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. చివరి 40 నిమిషాల్లో సినిమా అంతా కళ్లు చెదిరే యాక్షన్‌తో నింపేశారు. యాక్షన్… యాక్షన్‌తో కథనం పరుగులు పెడుతూనే ఉంటోంది. క్లైమాక్స్ ఫైట్ కూడా అదిరిపోయింది.
ఇంటర్వెల్ ట్విస్ట్, యాక్షన్ సీన్లు, క్లైమాక్స్ ఫైట్, సిస్టర్ సెంటిమెంట్, సెకండాఫ్‌లో పరుగులు పెట్టిన స్క్రీన్ ప్లే సినిమాకు హైలెట్స్. సినిమా అంతా యాక్షన్‌తో పరుగులు పెడుతూనే ఉంటుంది. ఫస్టాఫ్‌కు మించి సెకండాఫ్ వేగంగా ఉండడం, ట్విస్టులు ఇవన్నీ సినిమాను హిట్ చేశాయన్న టాక్ వస్తోంది. 60 ఏళ్ల వయస్సులో కూడా నాగార్జున అద్భుతంగా నటించాడని ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ఆయన లుక్ అదిరిపోయింది. హీరోయిన్ సోనాల్ గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. స్లోగా సాగే ఫస్టాఫ్, సాంగ్స్, కొన్ని ఎమోషనల్ సీన్లు కాస్త డిజప్పాయింట్ చేసినా.. ఓవరాల్‌గా నాగార్జున దసరాకు సోలోగా సాలిడ్ హిట్ కొట్టేశాడనే అంటున్నారు. పూర్తి రివ్యూతో ది ఘోస్ట్ ఫలితం తేలిపోనుంది.