Moviesఅడిగింది ఇవ్వ‌లేద‌ని మాధవీల‌త‌, పూర్ణ ఇద్ద‌రిని టార్చ‌ర్ పెట్టిన డైరెక్ట‌ర్‌...!

అడిగింది ఇవ్వ‌లేద‌ని మాధవీల‌త‌, పూర్ణ ఇద్ద‌రిని టార్చ‌ర్ పెట్టిన డైరెక్ట‌ర్‌…!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సింగర్స్..ఇలా అమ్మాయిలు ఏదో ఒకరకంగా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారనే మాట గత కొంతకాలంగా తరచుగా వినిపిస్తూనే ఉంది. ఇది ఒకప్పటి కంటే ఈ పదేళ్ళలో మరీ ఎక్కువైందని బాహటంగానే వాపోతున్నవారున్నారు. సోషల్ మీడియా బలపడిన తర్వాత ఇలా ఇండస్ట్రీలో ఎదుర్కుంటున్న అమ్మాయిలు డైరెక్ట్‌గా తమకి జరిగిన అవమానాలను, ఇబ్బందులను తెగేసి చెప్పేస్తున్నారు.

ఇందులో వారూ వీరూ అని ఏమీ లేదు. కొత్తగా వచ్చిన హీరోయిన్ దగ్గర్నుంచి స్టార్ స్టేటస్ దక్కించుకున్న వారి వరకూ ఉన్నారు. ఇటీవల మరో కొత్త మాట కూడా వినిపిస్తోంది. వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చి అగ్ర దర్శకుడిగా మారిన ఆయన కూడా ఓ 50 ఏళ్ళ సీనియర్ నటిని కమిట్‌మెంట్ అడిగారని ప్రచారం జరిగింది. ఇది దాదాపు నిజమే అని కూడా కొందరు ఏకీభవించారు. అంత సీనియర్ నటినే ఓ స్టార్ డైరెక్టర్ తన స్థాయి మర్చిపోయి కమిట్‌మెంట్ అడిగాడంటే ఇక కొత్తగా వచ్చే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 

 

ఇప్పటికే ఇలా కమిట్‌మెంట్ విషయంలో తెలుగమ్మాయి మాధవీ లత మొదటి సినిమాకే అనుభవించింది అంటూ చాలాసార్లు వాపోయింది. ఆ సినిమా దర్శకుడు చాలా హింసించాడని తనతో కమిటవనందుకు కనీసం కారవ్యాన్ కూడా ఇవ్వకుండా బయటే కూర్చోబెట్టాడని వెల్లడించింది. ఆ దర్శకుడు రవిబాబు అని కూడా ఇన్‌డైరెక్ట్‌గా చెప్పింది. రవిబాబు ఒక్క మాధవీలత విషయలోనే కాదు చాలామంది విషయంలోనూ ఇలాగే ప్రవర్తించాడని అంటుంటారు.

అలా ఇబ్బంది పడిన వారిలో పూర్ణ కూడా ఉందట. కానీ, ఇప్పటి వరకూ ఈ విషయాన్ని పూర్ణ.. మాధవీ లత మాదిరిగా బయట పెట్టకుండా గోప్యంగా ఉంచిందట. తన సన్నిహితుల వద్ద చెప్పడంతో ఆ విషయం అలా అలా బయటపడి ఇండస్ట్రీ వర్గాలలో చర్చగా మారిందట. గత కొంతకాలంగా అవకాశాలు లేని పూర్ణ బుల్లితెర మీద మాత్రం చాలా బిజీగా ఉంది. రవిబాబు దర్శకత్వంలో అవును, అవును 2 చేసింది. ఆ సమయంలో పూర్ణ రవిబాబు వల్ల ఇబ్బంది పడిందని టాక్ విపిస్తుంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news