Moviesబిగ్ షాక్: సరోగసి చేసిన హాస్పిటల్ ని గుర్తించిన అధికారులు.. నయన్-విగ్నేశ్...

బిగ్ షాక్: సరోగసి చేసిన హాస్పిటల్ ని గుర్తించిన అధికారులు.. నయన్-విగ్నేశ్ లకు చిప్ప కూడు ఖాయం..మంత్రి వార్నింగ్..!!

అయ్యయ్యో ..పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు.. ఎంతో ఆశగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార – విగ్నేష్ శివన్.. జీవితాలలోకి అనుకోని సమస్య వచ్చి పడింది. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ప్రేమించుకుని.. కొన్నాళ్లు డేటింగ్ చేసుకొని ..ఆ తర్వాత పెద్దలను ఒప్పించుకుని మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకున్నారు. ధూమ్ ధామ్ అంటూ ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట పెళ్లయిన తర్వాత తమకు నచ్చిన ప్రదేశాలకు హనీమూన్ లంటూ తిరుగుతూ రేంజ్ లో ఎంజాయ్ చేసారు.

అయితే రీసెంట్ గా అక్టోబర్ 9న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో డైరెక్టర్ విగ్నేష్ శివన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు . “నేను నయనతార అమ్మ అప్పలము అయ్యాము . మాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు” అంటూ బిగ్ బాంబ్ పేల్చారు. ఎస్ పెళ్లై నాలుగు అయిదు నెలలు కూడా కాకముందే ఇద్దరు కవల పిల్లలు ఎలా పుట్టారు అంటూ జనాలు చెవులు కోరుకున్నారు. అయితే ఇదంతా సరోగసి ప్రాసెస్ వల్లే అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.

దీంతో మరో బిగ్ బాంబ్ నయనతార విగ్నేష్ నెత్తిన పడింది. ఇండియాలో సరోగసి బ్యాన్ చేశారు . మరి వీళ్ళు పిల్లల్ని ఎలా కన్నారు అంటూ పలువురు ఈ జంటపై మండిపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రహ్మణ్యన్.. నయనతార విగ్నేష్ శివన్ల పై మండిపడ్డాడు. చట్ట వ్యతిరేకంగా మీరు సరోగసి ప్రాసెస్ ను అమలు చేసిన్నట్లైతే మీకు తగిన శిక్ష పడుతుంది” అంటూ హెచ్చరించారు . నయనతార విగ్నేష్ నిబంధనలను అతిక్రమించినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం అంటూ ఓపెన్ గాని మీడియా ముందు చెప్పారు.

కాగా రీసెంట్గా శుక్రవారం చెన్నైలో ఎంజిఎం ఆసుపత్రి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు . ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ..”నయనతార విగ్నేశ్ శివన్ లకు సహకరించిన హాస్పిటల్ ని గుర్తించాం.. ఒకవేళ అది నిజమని తెలిస్తే నిబంధనను అతిక్రమించినట్లు ప్రూవ్ అయితే మాత్రం నయనతార విగ్నేష్ శువన్ల ను వదిలిపెట్టం ..చట్ట పరమైన యాక్షన్ తీసుకుంటాం “అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు . దీంతో నయనతార విగ్నేష్ వాళ్ళ పేర్లు సోషల్ మీడియాలో రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news