ప్రస్తుతం సమాజం ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. కొంచెం డబ్బు ఉంటే చాలు స్టార్ డాటర్లు ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు . ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ ఫారెన్ సాంప్రదాయాలను తీసుకొచ్చి మన ఇండియాలో అమలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ కూతుర్లు మాత్రం అలా కాదు . ఈ జనరేషన్ కి సంబంధించిన అమ్మాయిలే అయినా పద్ధతులు పూజలు ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు .నిజంగా ఇలాంటి అమ్మాయిలను చూసినప్పుడు చేతులెత్తి దండం పెట్టాలి రా బాబు అనిపిస్తుంది. అంత చక్కగా లక్షణంగా కనిపిస్తారు బాలకృష్ణ ఇద్దరు కూతుర్లు.
బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్విని బయట ఎక్కువ కనిపించదు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండరు. కానీ నారా బ్రాహ్మణి అలా కాదు ..సమాజం కోసం పేదవారి కోసం తన వంతు కృషి చేస్తూ అటు నందమూరి ఫ్యామిలీ ఇటు నారా ఫ్యామిలీ పరువు నిలబెడుతుంది. కాగా బ్రాహ్మణికి నాన్న అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు కూడా అంతే..” నీకు అమ్మ ఇష్టమా నా ఇష్టమా అంటే అందరి ముందు నాన్నంటే ఇష్టం నాకు” అంటూ గట్టిగా చెప్పేదట . ఇప్పటికి ఆ అలవాటు ఉందట ..”ఎవరైనా అమ్మ ఇష్టమా నా ఇష్టమా అంటే నాకు మా నాన్న ఇష్టం అంటూ ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటుందట ” ఆమెకి వాళ్ల నాన్నగారు బాలకృష్ణ అంటే చాలా గౌరవం ..ఇష్టం.. అలాగే భయం కూడా…
కాగా నారా బ్రాహ్మణి ప్రతి సంవత్సరం వాళ్ళ నాన్న గారి పుట్టినరోజుకు వెయ్యి మందికి పైగా అనాధలకు అన్నదానం చేస్తుందట. అయితే ఈ విషయం మాత్రం బయటకు చెప్పుకోదట బ్రాహ్మిణి. ఎందుకంటే పాపులారిటీ కాదు ఆమెకు కావాల్సింది నలుగురికి అన్నం పెట్టాను వాళ్ళ ఆకలి తీర్చాను అది చాలు నాకు అంటూ నారా బ్రాహ్మణి చెప్పుకోస్తుందట. ఇప్పటికీ ఆ అలవాటు ఉందట నారా బ్రాహ్మిణికి. కాలేజీ రోజుల్లో చదువుకునే టైంలో నుంచే ఈ అలవాటు ఉందట.
మొదటగా పదిమందికి తన దగ్గర ఉన్న డబ్బుల్ని సహాయం చేసేదట. ఇక తర్వాత క్రమీనా తన సంపాదన పెరిగే కొద్దీ బాలకృష్ణ పేరు చెప్పి వీలైనంతమందికి భోజనం పెట్టేదట. రీసెంట్గా పుట్టినరోజు జరుపుకున్న బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా కూడా బ్రాహ్మిణి వెయ్యి మందికి పైగా అనాధలకు అన్నదానం చేసిందట. కానీ ఆ విషయం మాత్రం బయటకు చెప్పుకోదట చిన్న సహాయం చేస్తేనే సోషల్ మీడియా వేదికగా టామ్ టామ్ కొట్టుకునే సెలబ్రిటీలు ఉన్న ఈ రోజుల్లో..ఇలా నారా బ్రాహ్మణి తండ్రి కోసం ఇంత చేస్తూ నందమూరి అభిమానులకు మరింత దగ్గర అయింది. నిజంగా ఈ విషయంలో నారా బ్రాహ్మణి గ్రేట్ అనే చెప్పాలి.