Movies"నీ వాల్యూ అంతే"..ఉదయ్ కిరణ్ ముఖాన చిల్లర కొట్టిన స్టార్ ప్రొడ్యూసర్.....

“నీ వాల్యూ అంతే”..ఉదయ్ కిరణ్ ముఖాన చిల్లర కొట్టిన స్టార్ ప్రొడ్యూసర్.. అంత బాధ భరించాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అన్నది మాత్రం వాస్తవం . సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ జీవితాన్ని తమకు నచ్చినట్టుగా బ్రతకాలని వెండితెరపై తమ బొమ్మను ఓ రేంజ్ లో పాపులర్ చేసుకోవాలని ఎంతో మంది హీరోలు హీరోయిన్లు ఇంట్లో ఇష్టం లేకపోయినా సరే ఒప్పించి బలవంతంగా కొందరు.. పారిపోయి కొందరు ..సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు . వీళ్ళల్లో కొందరు హీరో హీరోయిన్లుగా నటించి సెటిల్ అయితే.. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా జీవనం కొనసాగిస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీలోని మాయకు తట్టుకోలేక వెనుకబడిపోయారు.

ఫైనాన్షియల్ కష్టాలతో ఆత్మహత్య చేసుకున్నారు .వాళ్ళల్లో మనం మరీ ముఖ్యంగా ముందు వరుసలో ఉన్నారు ఉదయ్ కిరణ్. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాల అవసరం లేదు . తేజ డైరెక్షన్లో వచ్చిన చిత్రం అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ ..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. యువతను ఓ ఊపు ఊపేసిన సినిమా ఇదే . ఇక ఆ తర్వాత వచ్చిన నువ్వు-నేను , మనసంతా నువ్వే సినిమాలతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ అట్రాక్షన్ సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్.

నువ్వు నేను , మనసంతా నువ్వే, కలుసుకోవాలని మూడు సినిమాలను వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సినీ ఇండస్ట్రీలో యంగ్ లవర్ బాయ్ గా ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వాటి కారణంగా సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అతని తొక్కేయాలని చూడడంతో ఆ తర్వాత చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ క్రమంలోనే ఆయనతో సినిమాను తెరకెక్కించడానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్ట్ చూపించలేదు.

ఇక ఫైనాన్షియల్ గా కష్టాలు రావడంతో ఆఖరికి తన బెస్ట్ ఫ్రెండ్ తనకు ఎంతో ఆప్తుడైన స్టార్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి ” ఒక కథ ఉంది.. డైరెక్టర్ కూడా సిద్ధమే.. మీరు ప్రొడ్యూస్ చేస్తారా.. ప్లీజ్” అని అడిగినా కానీ అతడు కనికరించలేదట. టేబుల్ వద్ద ఉన్న చిల్లరను ఉదయ్ కిరణ్ ముఖాన కొట్టి ఫేస్ వాల్యూ ఇంతే అంటూ అతన్ని దారుణంగా అవమానించాడట. ఈ విషయం ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత బయటపడింది . కేవలం ఈ ప్రొడ్యూసర్ ఏ కాదు ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు అతని ఫ్రెండ్స్ కూడా అతని దగ్గరికి తీసుకురావడానికి ఇష్టపడలేదట . ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఉండే ఓ పెద్దాయన ఉదయ్ కిరణ్ ని దూరం పెట్టడమే కారణం అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఏది ఏమైనా సరే సినీ ఇండస్ట్రీ మంచి హీరోని కోల్పోయింది అన్న మాట మాత్రం వాస్తవం.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news