సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలు సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ ప్రమోట్ చేయడం.. అడ్వర్టైజ్మెంట్ లో నటించడం సర్వసాధారణం. ఇలా చేస్తే పాపులారిటీ పెరుగుతుందని డబ్బులు సంపాదించుకోవచో తెలియదు కానీ బడా బడా హీరోలు కూడా అడ్వర్టైజ్మెంట్లో నటించి కోట్లకు కోట్లు వెనకేసుకున్న దాఖలాలో ఉన్నాయి . అయితే రీసెంట్గా స్టార్ హీరో అమీర్ ఖాన్ యంగ్ బ్యూటీ కీయరా అద్వానీ నటించిన ఏయూ బ్యాంక్ యాడ్ పై భారీ ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏయూ బ్యాంక్ కి సంబంధించి ఓ యాడ్ షూట్ చేశారు . ఈ యాడ్ తాజాగా రిలీజ్ అయింది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని ఇద్దరు భార్యాభర్తలు గా నటించారు. ఇక ఇందులో కొత్తగా పెళ్లయిన వధువుగా కీయరా, వరుడుగా అమీర్ నటించగా ఇందులో హిందూ సాంప్రదాయంలో ఆ వధువరులని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. ఆ యాడ్ ప్రకారం అది చూసినవారు ముందు ఎవరు వెళ్లాలని అమీర్ ని అడుగుతాడు.. దానికి ఎవరు ఇంటికి కొత్తగా వస్తే వారే అని కియరా చెబుతుంది.
దీంతో ముందుగా అమీర్ ఇంట్లోకి అడుగుపెట్టడం.. హిందూ సాంప్రదాయని వెక్కిరించారు అంటూ కోపంతో నెటిజన్స్ ఊగిపోతున్నారు . అంతేకాదు ఈ యాడ్ పై సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా స్పందించాడు. “సామాజిక మతపరమైన సాంప్రదాయాలను మార్చడానికి బ్యాంకులు ఎప్పటినుంచి బాధ్యత వహిస్తున్నాయి . ఇలాంటి పనికిమాలిన పనులను మార్పులను హిందూ సంప్రదాయాల్లోనే చేస్తారు ఇడియట్స్” అంటూ ట్వీట్ చేస్తూ మండిపడ్డారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
I just fail to understand since when Banks have become responsible for changing social & religious traditions? I think @aubankindia should do activism by changing corrupt banking system.
Aisi bakwaas karte hain fir kehte hain Hindus are trolling. Idiots.pic.twitter.com/cJsNFgchiY— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 10, 2022