రమ్యకృష్ణ దాదాపుగా మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు… సౌత్ సినిమాలో అన్ని భాషల్లోనూ క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. బాహుబలి సినిమాకు ముందు వరకు రమ్యకృష్ణ అంటే సౌత్‌లోనే పాపులర్. కానీ ఆ సినిమాలో ఆమె చేసిన శివగామి దేవి రోల్‌తో రమ్య నట విశ్వరూపం ప్రపంచం అంతా చూసింది. చివరకు ఆ పాత్రకు ముందుగా అతిలోక అందాల సుందరి శ్రీదేవిని అనుకున్న దర్శకుడు రాజమౌళి.. చివరకు రమ్యకృష్ణను తీసుకుని .. ఆమె నటన చూశాక మెస్మరైజ్ అయిపోయాడు.
ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాక ఈ క్యారెక్టర్ శ్రీదేవి ఒప్పుకోకపోవడం మా అదృష్టం అని చెప్పాడంటేనే రమ్య ఎంతలా నటించిందో అర్థమవుతోంది. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో రమ్యకృష్ణకు ఐరెన్‌లెగ్ అన్న ముద్ర ఉండేది. ఆమె ఏ సినిమా చేసినా వరుస ప్లాపులే అయ్యేవి. ఆ తర్వాత చిన్న చిన్నగా ఆమె నిలదొక్కుకుంది. అదే టైంలో ఆమె దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కంట్లో పడింది. తన సినిమాల్లో వరుసగా ఛాన్సులు ఇచ్చి.. ఆమెను గ్లామర్‌గా బాగా చూపించి క్లిక్ అయ్యేలా చేశాడు.
రమ్యకృష్ణకు ఇంత స్టార్‌డమ్ రావడం వెనక రాఘవేంద్ర రావు చేసిన సాయం ఎంతో ఉంది. తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో పాటు తన బ్యానర్లో వచ్చిన సినిమాల్లోనూ ఆమెనే హీరోయిన్లుగా తీసుకునేవారు. ఇద్దరు మిత్రులు సినిమాలో రమ్య ఆరబోసిన అందాల గురించి చెప్పక్కర్లేదు. రాఘవేంద్రుడి దర్శకత్వంలో వచ్చిన అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్ సినిమాలోనూ విచ్చలవిడిగా అందాలు చూపించి రెచ్చగొట్టింది.
అలా తన సినిమాల్లో ఆమెను హాట్‌గా చూపించడం ఒక ఎత్తు అయితే… ఆమెలో ఉన్న సెక్సీ అప్పీల్ క్యాష్ చేసుకోవడంలో, బొడ్డు అందాలు చూపించడంలో, బికినీ అందాలు ఎక్స్‌పోజ్ చేయించే విషయంలో హైలెట్‌గా చూపించి… వాటిని జనాలకు బాగా అలవాటు చేయించాడు. అందుకే రాఘవేంద్రుడి సినిమా అంటేనే రమ్య రెచ్చిపోయి మరీ చూపించేది. అలా ఆమె రాఘవేంద్రుడి సినిమాలతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. చివరకు రాఘవేంద్రుడి సమర్పణలో వచ్చిన బాహుబలిలోనూ కీలక పాత్రలో నటించింది.