సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుని సినీ ఇండస్ట్రీ ని ఏలేసి ఆ తర్వాత ఎవరికి కనిపించకుండా అడ్రస్ లేకుండా పోయిన సినీ తారలు బోలెడు మంది ఉన్నారు. చాలామంది సినీ తెర పై కనీసం ఒక్కసారైనా కనపడాలని ఎన్నో ఆశలు పెట్టుకుని .. ఆశయాలతో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఓడిదుడుకులను కష్టాలను ఎదుర్కొని ఫైనల్లీ సక్సెస్ సాధించి.. ఫైనల్ గా అడ్రస్ లేకుండా పోతారు. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ నుపూర్ ఖాన్.
నుపూర్ అలంకార్ ..ఈ పేరుకి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఆఫ్కోర్స్ తెలుగు జనాలకి కూడా ఈ పేరు బాగా తెలుసు. హిందీలో నుండి డబ్ అయిన తెలుగు సీరియల్స్ ని మన తెలుగు వాళ్లు ఎక్కువుగా చూస్తారు. ఈ కారణంగానే నుపూర్ అలంకార్ తెలుగు జనాలకు కూడా బాగా సుపరిచితురాలు . హిందీ జనాలకు అయితే ఓ రేంజ్ లో అమ్మడు నటన నచ్చేసింది . నుపూర్ ఒకప్పుడు బుల్లితెరపై ‘శక్తిమాన్’, ‘దియా ఔర్ బాతీ హమ్’, ‘ఘర్ కీ లక్ష్మీ’ లాంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించి ఎంతో ఫేమస్ అయ్యింది. ఈమె పలు సినిమాల్లో కూడా నటించి వెండితెర ప్రేక్షకులను మెప్పించింది. సాధారణంగా సీరియల్స్ నటించే వాళ్ళు సినిమాలోకి వస్తే పెద్దగా గౌరవం ఇవ్వరు .
కానీ నుపూర్ అలంకార్ మాత్రం అలా కాదు. ఓవైపు సినిమాలు మరోవైపు సీరియల్స్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ జనాల దగ్గర శభాష్ అనిపించుకుంది. కాగా కెరియర్ పిక్స్ లో ఉన్న టైంలోనే ఎవరికి కనిపించకుండా మాయమైపోయింది. సినీ ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. దీంతో అసలు నుపూర్ ఎక్కడికి వెళ్ళిపోయింది ..?ఏం చేస్తుంది..? ఏ కారణం చేత సినీ ఇండస్ట్రీకి దూరమైంది ..? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ప్రేంట్ ఈమె ఓ సన్యాసిగా మారి వీధుల్లో భిక్షాటన చేస్తుంది. దీంతో ఈమె అభిమానుల షాక్ అయిపోయారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఫ్యాన్స్ షాక్ అయిపోయారు .సన్యాసిగా మారి కాషాయ దుస్తులు ధరించి.. ఉత్తరప్రదేశ్‌లోని మధుర వీధుల్లో భిక్షాటన చేస్తున్న ఈమె చూసి ఫాన్స్ బాగా ఫీల్ అయిపోతున్నారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం గురువు గురువు శంభు శరణ్ ఝా సూచనతోనే అని తెలుస్తుంది.