సూపర్ స్టార్ మహేష్ బాబు 12 ఏళ్ల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి సినిమా చేస్తుండడంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై మామూలు అంచనాలు లేవు. 2005లో వచ్చిన అతడు, 2010లో వచ్చిన ఖలేజా తర్వాత ఇప్పుడు 12 ఏళ్లకు మళ్లీ ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్ సెట్ అయ్యింది. ఈ 12 ఏళ్లలో ఇద్దరి ఇమేజ్లో చాలా మార్పులు వచ్చేశాయి. పైగా అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురంలో లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత త్రివిక్రమ్ వరుసగా మళ్లీ మహేష్ లాంటి స్టార్ హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇటు మహేష్‌కు కూడా వరుసగా నాలుగు హిట్ల తర్వాత స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేస్తున్నాడు. ఇద్దరూ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. మహేష్ కెరీర్‌లో SSMB28 అనే వర్కింట్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ ఆస్తాన నిర్మాత రాధాకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మహేష్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది. రెండో హీరోయిన్‌గా శ్రీలీలతో పాటు పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన స్పెషల్ సెట్లో ఓ భారీ యాక్షన్ ఘట్టంతో స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా టైటిల్‌పై త్రివిక్రమ్ క్లారిటీతో ఉన్నట్టే తెలుస్తోంది.
త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ అంటేనే అ అక్షరంతో స్టార్ట్ అవుతాయి. అ..ఆ – అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో ట్రాక్ కంటిన్యూ చేస్తే మహేష్ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సినిమాలో మహేష్ రోల్ పవర్ ఫుల్‌గా ఉంటుందట. అర్జనుడు అనే పేరుకు తగినట్టుగా త్రివిక్రమ్ ఈ పేరు సెట్ చేశాడట. మరి అ సెంటిమెంట్ మహేష్‌కు మరో బ్లాక్ బస్టర్ ఇస్తుందో ? లేదో ? చూడాలి.