అప్పటి తరం నటుల్లో.. సోగ్గాడుగా తెలుగు ప్రజలు సహా తమిళనాడు ప్రజలతో జేజేలు కొట్టించుకున్న హీరో ఆంధ్రా అందగాడు శోభన్‌బాబు. ఆయన అనేక సినిమాల్లో ఆయన నటించారు. ఆయన స్పురద్రూపి. చూడగానేఅందరికీ నచ్చుతాడు. పైగా..క్రమశిక్షణకు మారుపేరుగా ఆయన పేరు ఇప్పటికీ.. ఇండస్ట్రీలో నిలిచిపోయింది. టైం అంటే.. టైం! ఒక్క నిముషం కూడా ఆయన వేస్ట్ చేసేవారు కారట. ఈ క్రమంలోనే అన్నగారికి ఆయన పరిచయం.. అనూహ్యంగా జరిగింది. కృష్ణాజిల్లాకు చెందిన శోభన్‌బాబు.. అన్నగారు.. కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు.
అయితే.. అన్నగారికి శోభన్‌బాబుకు తేడా ఏంటంటే.. బడ్జెట్!. దీనిని గుమ్మడి వెంకటేశ్వరరావు రాసుకున్న తీపి గురుతులు.. చేదు జ్ఞాపకాలు పుస్తకంలో ప్రస్తావించారు. సినిమా హిట్ కొట్టిన తర్వాత.. అన్నగారు.. తన రెమ్యూనరేషన్ పెంచేసేవారట. అంటే.. తదుపరి సినిమాకు ఆయన 20 నుంచి 30 శాతం రెమ్యూనరేషన్ పెంచేసిన సందర్భాలు ఉన్నాయని చెబుతారు. ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పెంచినా తన సినిమాకు వచ్చిన వసూళ్లను బట్టే పెంచేవారట.
అయితే..శోభన్‌బాబు మాత్రం సంవత్సరానికి ఒకసారి మాత్రమే.. తన రెమ్యూనరేషన్ పెంచేవారట. అది కూడా.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా.. అన్నిసినిమాలకు ఒకే రకంగా.. పెంచేవారట. ఈ క్రమంలోనే బాపు-రమణలు ఒకసందర్భంలో సంపూర్ణ రామాయణం సినిమా తీయాలని అనుకున్నప్పుడు.. ముందుగా.. అన్నగారు రామారావు.. తర్వాత.. కృష్ణంరాజును కూడా సంప్రదించారు.
కృష్ణంరాజు కాల్షీట్లు లభించలేదు. అన్నగారు.. అప్పటికే విడుదలైన ఒక సినిమా హిట్ కొట్టడంతో రెమ్యునరేషన్ భారీగా పెంచేశారట. దీంతో ఆ రెమ్యునరేషన్‌తో సినిమా మొత్తం తీసేస్తామన్న.. బాపు, రమణలు.. శోభన్‌బాబును సంప్రదించడం.. ఆయన చేయడం.. ఆ సినిమా సూపర్‌గా హిట్ కొట్టడం తెలిసిందే.
దీంతో ఈ విషయం తెలిసి అన్నగారు ఒకింత చింతించారట. అరె.. మంచి అవకాశం పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారట. ఈ క్రమంలో నే తర్వాత చాలా కాలానికి అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని శ్రీనాథ కవిసార్వభౌమ సినిమాను బాపు-రమణలతో చేశారని గుమ్మడి పేర్కొన్నారు. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా బాపు – రమణతో కలిసి పనిచేశానన్న తృప్తి కోసమే ఎన్టీఆర్ ఆ సినిమా చేశారట.