సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేము. ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా సరే జనాల మనసుకు హత్తుకుని ఉంటాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలే జనాల మనసుల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి . అలాంటి సినిమాలలో ఒకటే “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు “. 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, హీరో మహేష్ బాబు ముఖ్య పాత్రలో కనిపించారు. మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చేసారు. అంతేకాదు ఈ సినిమాను అగ్ర ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 11న 2013లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నింది. మరీ ముఖ్యంగా రావు రమేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, అంజలి, సమంత పాత్రలు బాగా డిజైన్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. అయితే ఈ సినిమా మొత్తం సీత క్యారెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ పాత్రలో కనిపించి అంజలి అందర్నీ ఆకట్టుకుంది. క్లాసిక్ లుక్స్ తో ట్రెడిషనల్ పద్ధతిలో సీతగా అంజలి అందర్నీ ఆకట్టుకుంది . అయితే నిజానికి అంజలి ప్లేసులో ముందు అనుకున్న హీరోయిన్ కలర్స్ స్వాతి .
ఫస్ట్ దిల్ రాజు శ్రీకాంత్ ఆమెని అంజలి పాత్రకి చూస్ చేసుకున్నారట . కానీ ఆ తర్వాత మహేష్ బాబుకు జోడిగా సమంతను అనుకున్నాక సమంత, కలర్ స్వాతి ఇద్దరు ఒకే ఏజ్ లుక్ లో కనిపిస్తూ ఉండడం సినిమా కి కొంచెం మైనస్ అవుతుందని సీత క్యారెక్టర్ కి కొంచెం ఏజ్డ్ గా కనిపించే హీరోయిన్ అయితే అక్క పాత్రగా సెట్ అవుతుంది అని ..తెలుగమ్మాయి అయితే మరింత బాగుంటుందని.. వెతికి వెతికి అంజలిని అప్రోచ్ అయ్యారట.
ఈ స్టోరీ చెప్పగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాజెక్టుపై సైన్ చేసినట్లు అప్పట్లో టీం ప్రకటించింది. ఇక ఈ సినిమా అంజలి కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఒకవేళ నిజంగా కలర్స్ స్వాతి ఈ కార్యక్రమం చేసి ఉంటే .. ఈ సినిమా ఇంత హీట్ అయ్యేది కాదేమో అంటున్నారు జనాలు. ఏదేమైనా దిల్ రాజు క్యారెక్టర్స్ చూసింగ్ లో నెంబర్ వన్ అని మరోసారి ప్రూవ్ చేశాడు.