Movies"అది లేకుండా నువ్వు బ్రతకలేవు రా"... చైతన్య కు సమంత...

“అది లేకుండా నువ్వు బ్రతకలేవు రా”… చైతన్య కు సమంత అన్ బిలీవబుల్ కౌంటర్..!? పరువు పాయే..!!

మనకు తెలిసిందే.. విడాకుల తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా మారింది. గతంలో పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత లేనంత సూపర్ యాక్టివ్గా సోషల్ మీడియాలో సమంత మారడం చూసి జనాలు కూడా షాక్ అయిపోయారు . ఎవరైనా సరే జనరల్ గా విడాకులు తీసుకున్న తరువాత లబోధిబో అంటూ ఏడుస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు. అయితే సమంత మాత్రం అందుకు వ్యతిరేకంగా బిహేవ్ చేసింది .

ప్రతి విషయంలోను అక్కినేని ఫ్యామిలీకు కౌంటర్ ఇస్తూ సమంతా అనే పేరును హైలెట్ చేసుకుంది . అంతేనా మరి ముఖ్యంగా కాఫీ విత్ కరణ్ షోలో సమంత నాగచైతన్య పై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ గానే ఉన్నాయి. అంతలా నాగచైతన్య పై ఘాటుగా స్పందించింది సమంత. కాగా రీజన్ ఏంటో తెలియదు కానీ గత కొన్ని వారాలుగా సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉంది. దానికి కారణం బాలీవుడ్ స్టార్ హీరో ఫ్రెండ్ అని వార్తలు వినిపిస్తున్నా.. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సమంత హెల్త్ ఇష్యూ కారణంగా అమెరికా వెళ్ళిందని అక్కడే కొన్నాళ్లు ట్రీట్మెంట్ తీసుకుంటుందని తెలుస్తుంది.

అయితే రీసెంట్గా సమంత వేసుకున్న టీ షర్ట్ ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. సమంత టీ షర్ట్ పై రాసి ఉన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. టీ షర్ట్ పై తోడు లేకుండా నువ్వు బ్రతకలేవు అని రాసి ఉంది . యు విల్ నెవర్ వాక్ అంటూ సమంత ఇచ్చిన కౌంటర్ నాగచైతన్య కే అంటున్నారు ఫాన్స్ . దీంతో సమంత నాగచైతన్య పేర్లు మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news