సినీ నటుల జీవితాలు తెరపై చాలా బాగుంటాయి . కోట్లకు కోట్ల ఆస్తి.. కందిపోని అందం ..చిటికెలో కోరికలు తీర్చే పని వాళ్లు భళే ముచ్చటగా ఉంటాయి . అయితే అది మొత్తం కెమెరా ఆన్ అయినప్పుడే.. కెమెరా ఆఫ్ అయ్యి ఇంటికి వచ్చాక మాత్రం.. వారి జీవితం సామాన్యల జీవితం కన్నా ఘోరంగా ఉంటాయి సెలబ్రిటీల జీవితాలు అంటూ మరోసారి ప్రూవ్ చేసింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.
ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు . ఏం మాయ చేసావే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత మొదటి సినిమాతోనే కోట్లాదిమంది ప్రజల మనసులను కొల్లగొట్టింది. ఇక ఆ తరువాత వరుసగా తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుతుంది. కేవలం తెలుగులోనే కాదు తమిళంలో కూడా సమంత స్టార్ హీరోయిన్గా సినిమాలు చేసింది . రీసెంట్ గా బాలీవుడ్ లోకి ఎంటర్ అయింది.
కాగా సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఫాన్స్ కు చెప్పుకొచ్చింది. మయోసిటీస్ అనే అరుదైన వ్యాధితో సమంత బాధపడుతుంది . ఈ వ్యాధి లక్షణాలు కండరాలు ఎక్కువగా నొప్పి తీస్తాయి . అంతేకాదు జబ్బు మహా ముదిరితే ఎక్కడంటే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతారు . ఈ జబ్బుకి ట్రీట్మెంట్ కరెక్ట్ గా తీసుకుంటే ప్రాణాపాయం తగ్గుతుంది . లేదంటే ప్రాణాలు కూడా పోవచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు డాక్టర్లు . కాగా సమంత కి ఇలాంటి జబ్బు ఎందుకు వచ్చిందా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా సాగుతుంది.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం సమంత హెవీ వర్కౌట్స్ కారణంగానే ఇలాంటి జబ్బు వచ్చిందని తెలుస్తుంది. సమంత ఫుడ్ డైట్ ..ఓవర్ వర్కౌట్స్ కారణంగానే ఈ మయోసిటీస్ అనే వ్యాధి ఆమెకు వచ్చినట్లు డాక్టర్లు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎక్కువ ఫుడ్ తీసుకోలేదని ..తెలియని డిప్రెషన్ కి లోనై.. డైలీ కన్నా ఎక్కువగా వర్క్ అవుట్స్ చేసుకొచ్చిందని.. ఈ కారణంగానే ఆమెకు ఈ జబ్బు మరింత ముదిరిపోయిందని సినీ వర్గాలల్లో టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా సరే అటు ఆరోగ్యపరంగా ఇటు ఫ్యామిలీ పరంగా రెండిటిని నష్టపోయింది సమంత. త్వరగా పూర్తి ఆరోగ్యంగా కోలుకుని మళ్ళీ సినిమాలు చేయాలని జనాలు కోరుకుంటున్నారు.