కేజిఎఫ్ సినిమాలో ప్రైమ్ మినిస్టర్ పాత్రలో నటించిన రవీనా టాండన్ మీకందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ నటి ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్. ఒకప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్ లో దాదాపు పదేళ్లపాటు హీరోయిన్ గా చెలామణి అయింది. వాస్తవానికి ఆమె హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. ఆమె తొలుత ఒక యాడ్ ఫిలిం మేకర్ ప్రహ్లాద్ కక్కర్ దగ్గర పనిచేసేది. కానీ ఆమెను చూసిన చాలా మంది హీరోయిన్ గా ఉన్నావ్ అంటూ కితాబిచ్చేవారు. అలాగే డైరెక్టర్ శంతను షరాయి ఆమెకి సినిమా ఆఫర్ చేశాడు. కానీ ఆ సమయంలో రవీనా అందుకు ఒప్పుకోకపోగా ఆమెను ఒప్పించి హీరోయిన్ గా నటించడానికి ప్రహ్లాద్ కారణమయ్యాడు.
అలా సల్మాన్ ఖాన్ సినిమా పత్తర్ కే పూల్ లో తొలిసారిగా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు ఫిలింఫేర్ లక్స్ న్యూ పేస్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించిన రవీనా తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఆమె నటించినా బంగారు బుల్లోడు సినిమా ఎంతో పెద్ద హిట్ అయింది. అలాగే నాగార్జునతో ఆకాశవీధిలో, రథసారథి చిత్రంలో, ఇక మోహన్ బాబు తో పాండవులు పాండవులు తుమ్మెద వంటి సినిమాల్లో నటించింది.
రవినా వ్యక్తిగత జీవితం ఎన్నో విమర్శల పాలయింది. ఆమె పెళ్లి కాకముందే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. వారి పేర్లు పూజ మరియు ఛాయా. 1995లో 11 మరియు 8 ఏళ్ళ పిల్లలను దత్తత తీసుకుంది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ తో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసింది. ఆ డేటింగ్ బ్రేక్ అవగానే సినిమా డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానితో కూడా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు సైతం ఒక కొడుకు, ఒక కూతురు ఉంది. ఇక రవీనా సినిమా బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. ఈమె స్వయనా మాక్ మోహన్ కి కోడలు కావడం విశేషం. అలాగే మంజరి మకిజానికి కజిన్ అవుతుంది. రవీనా సోదరుడు రాఖీ టాండన్ ని పెళ్లి చేసుకున్నాడు. ఇక తెలుగులో కొన్ని సినిమాలు చేసిన కిరణ్ రాథోడ్ సైతం రవీనాకు కజిన్ అవుతుంది.
ఇక రవీనా టాండన్ ప్రేమ విషయానికి వస్తే అనిల్‌కు ముందు అనేకసార్లు ప్రేమలో పడి విఫలమైంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమె అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లతో ఎక్కువ కాలం రిలేషన్ లో ఉంది. అజయ్ దేవగన్ కోసం రవీనా ఓసారి ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసిందట. అజయ్ కోసం రవినాటాండన్ – కరిష్మా కపూర్ ఇద్దరూ గొడవ పడ్డారని అదే సమయంలో రవీనా ఆత్మహత్య ప్రయత్నం చేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై అజయ్ దేవగన్ స్పందిస్తూ ఇదొక పబ్లిసిటీ స్టంట్ అని కొట్టి పారేయడం విశేషం.
ఇక రవీనా – అజయ్ దేవగన్ ప్రేమ ఉత్తరాలు కూడా పంచుకున్నారట. వాస్తవానికి వీరిద్దరూ 1994లో ఒక సినిమా షూటింగ్ లొకేషన్లో ప్రేమలో పడ్డారు. అయితే కరిష్మాపై ఉన్న ఇంట్రెస్ట్ తో రవీనాకి అజయ్ హ్యాండిచ్చే ప్రయత్నం చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది ఈ విషయంపై ఇద్దరికీ గొడవలు జరిగాయట. ఆ తర్వాత కరిష్మా కపూర్, రవీనా టాండన్, అజయ్ దేవగన్ వారి వారి వ్యక్తి గత జీవితాల్లో వేరు వేరు వ్యక్తులను పెళ్లి చేసుకొని ప్రస్తుతం సెటిలై హ్యాపీగా ఉన్నారు.