రష్మిక మందన్న కన్నడ అమ్మాయి అయినా తెలుగులోనే బాగా పాపులర్ అయ్యింది. తెలుగు ఇండస్ట్రీయే ఆమెను తిరుగులేని స్టార్ హీరోయిన్‌ను చేసింది. ఈ దెబ్బతో ఆమె అటు తమిళంలోనూ, బాలీవుడ్‌లోనూ టాప్ స్టార్ల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటోంది. రష్మిక పేరు ఇప్పుడు సౌత్ టు నార్త్ వరకు మార్మోగిపోతోంది. కన్నడంలో కిరాక్ పార్టీ సినిమాతో రష్మిక పాపులర్ అయ్యింది. ఆ సినిమాతోనే ఆమెకు మంచి పేరు వచ్చింది.
అయితే తన తొలి సినిమా హీరో రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడింది. వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. అయితే ఎంగేజ్‌మెంట్‌కు పెళ్లికి గ్యాప్ ఉండడం.. మధ్యలో కరోనా రావడం ఆమె జీవితాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పేసింది. ఛలో – గీతగోవిందం సినిమాలు ఆమెను తిరుగులేని స్టార్ హీరోయిన్‌ను చేసేయడంతో ఆమె ఎంగేజ్మెంట్ బ్రేకప్ చెప్పేసుకుని కెరీర్‌పై కాన్‌సంట్రేషన్ చేసింది.
దీంతో కన్నడ జనాల నుంచి ఆమెపై తీవ్రమైన విమర్శలే వచ్చాయి. అయినా రష్మిక ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. అయితే రష్మిక తెలుగులోకి రావడానికి ముందే కన్నడలో ఒకరిద్దరు హీరోలతో ఆమె ప్రేమాయణం నడిపింది. ఇక ఇప్పుడు కూడా తన మాజీ ప్రియుళ్లతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని ఆమె ఎప్పుడూ చెపుతూ ఉంటోంది.
బాలీవుడ్‌లో బిజీగా ఉన్న రష్మిక తన మాజీ ప్రియుళ్ల గురించి కామెంట్ చేసింది. గుడ్ బై సినిమా ప్రమోషన్లో ఆమె మాట్లాడుతూ తన మాజీ ప్రియుళ్లతో తాను ఇప్పటకీ పలకరించుకునేంత సాన్నిహిత్యం ఉందని ఆమె చెప్పింది. వారు ఎదురు పడితే తాను ఎప్పుడూ హాయ్ చెపుతూ ఉంటానని.. వాళ్ల కుటుంబాలతోనూ సన్నిహితంగానే ఉంటానని చెప్పింది. అయితే ఆ మాజీ ప్రియుళ్లు ఎవరో పేర్లు మాత్రం చెప్పలేదు.
ప్రేమపరంగా తాము బ్రేకప్ చెప్పుకున్నా వారిని పలకరించే విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. బటయ వాళ్లు ఏమనుకున్నా తన మాజీ ప్రియుళ్లు మాత్రం తనను ఎంత మాత్రం ద్వేషించడం లేదని.. బ్రేకప్‌ల తర్వాత కూడా వారితో సన్నిహితంగానే ఉంటున్నానని రష్మిక ఎప్పటికప్పుడు గొప్పగా చెప్పుకుంటోంది.