రాజమౌళి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . తెలుగు సినిమాలను దేశ స్థాయిలో గుర్తింపు దక్కించుకునేలా చేసిన ఏకైక డైరెక్టర్ ..అంతేకాదు మనకి తెలుగు సినిమాలు ఇంతటి ప్రజాధరణ పొందుతున్నాయి అంటే దానికి ఏకైక కారణం జక్కన్న అనే చెప్పాలి . ఆయన తీసిన మగధీర ,బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ ఇలా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాయి. వేరే దేశాల్లో రిలీజ్ అయి సంచలన రికార్డులు నెలకొల్పాయి. ఈ క్రమంలోని రాజమౌళి పేరు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది.
ఆఫ్ కోర్స్ ఎక్కడ పాజిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారో.. అక్కడ నెగటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడ మనల్ని పైకి ఎత్తేసే జనాలు ఉంటారో అక్కడ మనల్ని కిందకి లాగే జనాలు ఉంటారు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో రాజమౌళిని పొగిశేసే జనాలు ఎంతమంది ఉన్నారో.. ఆయన పడిపోవాలని డి గ్రేట్ చేసే జనాలు బోలెడు మంది ఉన్నారు. కానీ బయటికి చెప్పుకోరు. అంతే ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. మనకు తెలిసిందే రాజమౌళి ఫామ్ లోకి రానప్పుడు బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎవరా అంటే అందరూ శంకర్ పేరు చెప్పేవారు . కానీ ఇప్పుడు ఆయన పేరు మరుగున పడిపోయింది . శంకర్ పేరు గుర్తుపెట్టుకునే నాధుడే లేకుండా పోయాడు.
ఈ క్రమంలోనే మరో క్రేజీ న్యూస్ విన్న శంకర్.. రాజమౌళి పై కుళ్ళుకొని చచ్చిపోతున్నాడు అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే రీసెంట్గా రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. ఇప్పుడు జపాన్ లో రిలీజ్ కు సిద్ధమైంది ఆర్ఆర్ఆర్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం ఆర్ఆర్ఆర్ టీం మొత్తం జపాన్ చెక్కేసింది . అక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తున్న ఫోటోలను మన స్టార్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
కాగా రీసెంట్గా రాజమౌళి ప్రత్యేకంగా ఒక గేమింగ్ స్టూడియో కి వెళ్లారు . మెటల్ గేర్ లాంటి అద్భుతమైన వీడియో గేమ్ ని సృష్టించిన హిడియో కోజిమాని కలిసేందుకు స్టూడియో కి వెళ్లారు రాజమౌళి. దీంతో అక్కడ బాడీ మొత్తాన్ని రకరకాల కెమెరాలతో స్కాన్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే త్వరలోనే ఆర్ఆర్ఆర్ పాత్రలతో ఓ గెమ్ డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అందుకే రాజమౌళి బాడీని స్కాన్ చేసి ఉంటారని జనాలు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇలాంటి ఘనత సాధించిన ఏకైక ఇండియన్ డైరెక్టర్గా రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది. దీంతో శంకర్ రాజమౌళిని చూసి కుళ్ళు కుంటున్నారని ఆయనపై న్యూస్ వైరల్ గా మారింది.