బక్కపలచని భామ త్రిష కృష్ణన్ అంటే ఇప్పటికీ కొందరు దర్శక, నిర్మాతలు క్రేజ్‌తో అల్లాడుతున్నారు. తెలుగులో నీ మనసు నాకు తెలుసు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తరుణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రియ శరన్ కూడా ఓ హీరోయిన్‌గా నటించింది. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందులోకపోయింది. కానీ, అందరి దృష్ఠిలో మాత్రం త్రిష బాగా పడింది. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర నిర్మాతగా వెలిగిన ఎంఎస్ రాజు త్రిష అంటే బాగా ఆసక్తి చూపించారు.
తెలుగులో ఆయన నిర్మాతగా వచ్చిన సినిమా వర్షం. ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా ఇది. ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన మూడో సినిమా వర్షం. ఈ సినిమాలో కాస్త కొత్త అమ్మాయిని చూడాలి..అది కూడా ప్రభాస్ హైట్‌కి తగ్గట్టుగా ఉండాలని అప్పట్లో త్రిష బాగా వార్తల్లో నిలుస్తుండటం, అందరిలోనూ తన గురించే చర్చలు సాగుతుండటంతో ఎంఎస్ రాజు హీరోయిన్‌గా త్రిషను తీసుకున్నారు.
వర్షం ఎంత భారీ సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. మనసంతా నువ్వే, నీ స్నేహం, ఒక్కడు సినిమాలతో మంచు ఊపు మీదున్న ఎంఎస్ రాజు భారీ బడ్జెట్‌తో వర్షం సినిమాను నిర్మించి మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాతో త్రిష, రాజు గారికి బాగా కనెక్ట్ అయిపోయింది. అంతే, బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తనతోనే నిర్మించారు. ఈ సినిమా తర్వాత త్రిష హీరోయిన్‌గా నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా కూడా రాజు గారిని లాభాలలో ముంచేసింది. అదే ఉత్సాహంతో కథ బాగాలేదని చాలా మంది చెప్పినా వినకుండా త్రిషను ఆధారంగా చేసుకొని పౌర్ణమి చిత్రాన్ని తీశారు. త్రిషతో రాజు బాగా కనెక్ట్ అయిపోయారు. తనకు టాలీవుడ్‌లో మంచి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన నిర్మాత కావడంతో ఆయన్ను నమ్మి మీ ఇష్టం ఎన్ని సినిమాలకు డేట్లు ఇవ్వమంటారో ? అని రాజుకు ఓపెన్ ఆఫర్ చేసింది.
అయితే రాజు వరుసగా నిర్మించిన బ్లాక్ బస్టర్స్‌తో వచ్చిందంతా ఒక్క పౌర్ణమి సినిమాతో పోగొట్టుకున్నారు. ఆ దెబ్బతో త్రిషను పక్కనపెట్టి ఇలియానాతో ఆట సినిమాను తీశారు. ఇదే కాదు దీని తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపవుతూ వచ్చాయి. ఇప్పటికీ దర్శకనిర్మాతగా సినిమాలు చేస్తున్న రాజు గారు మళ్ళీ కోలుకునే హిట్ కొట్టలేకపోయారు.