Moviesవిప్పినా చూడరు..కప్పుకున్న చూడరు.. మరి ఏం చేయాలి రా అబ్బాయిలు..!

విప్పినా చూడరు..కప్పుకున్న చూడరు.. మరి ఏం చేయాలి రా అబ్బాయిలు..!

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు . అదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్ . అమ్మడు పేరు ఇలా చెప్తే ఎవరికి గుర్తు రాదు ..కన్ను గీటు సుందరి అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తొచ్చేస్తుంది. అంతలా ఒకే ఒక్క సినిమాతో తన పేరుని దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసుకుంది. కాగా ప్రియా తెలుగులో బోలెడు సినిమాలో నటించింది. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆమెకు మంచి పేరు తీసుకురాలేదు.

ఆఫ్ కోర్స్ ఆమె నటన బాగుంది అన్న కామెంట్స్ వినిపించినా.. లిప్ లాక్ లో చేసినా..పట్టించుకునే జనాలే లేరు. దీంతో ప్రియా తెలుగు ఇండస్ట్రీకి పనికిరాదు అంటూ జనాలు ఆమెను చూడడం మానేశారు. ఈ క్రమంలోనే ప్రియా రూట్ మార్చింది . హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రీసెంట్గా దీపావళి సందర్భంగా ప్రియ పట్టు చీరలో మెరిసిపోయింది. ఒంటినిండా నగలు పెట్టుకొని ..చెవులకి జుంకీలు .. నుదుటి పాపటి బిల్ల అచ్చం తెలుగు అమ్మాయిల మెరిసిపోయింది .

అయినా కానీ ప్రియని జనాలు పట్టించుకోవట్లేదు . మిగతా హీరోయిన్స్ చేసిన ఫోటోషూట్స్ పై కామెంట్స్ ట్రెండ్ అవుతున్నాయి కానీ ప్రియాను జనాలు పట్టించుకోనే లేదు. ఈ క్రమంలోనే ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది .ఎక్స్పోజ్ చేసిన చూడరు.. ట్రెడిషనల్ లుక్ లో రెడీ అయిన చూడరు.. మరి ఏం చేస్తే నేను అవకాశాలు దక్కించుకుంటాను అంటూ ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొని బాధపడిందట. ప్రజెంట్ ప్రియా బాధ కు సంబంధించిన వార్త వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ట్ చేయలేరు అన్నది మరోసారి ప్రూవ్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news