Moviesఆమె వల్లనే మహేశ్ పెదాల పై నవ్వు పోయింది..పరచూరి సంచలన కామెంట్స్..!!

ఆమె వల్లనే మహేశ్ పెదాల పై నవ్వు పోయింది..పరచూరి సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో పరుచూరి ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . పరుచూరి బ్రదర్స్ గా సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. టాలీవుడ్ సీనియర్ రచయితగా పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజెంట్ వస్తున్న సినిమాల పరిస్థితిని క్షుణ్ణంగా వివరిస్తున్న సంగతి తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తున్నారని చెప్పాలి. ఈ మధ్యకాలంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రతి సినిమాకి తనదైన స్టైల్ లో రివ్యూస్ ఇస్తూ సినిమాలోని తప్పు ఒప్పులను పైకి చెబుతూ డైరెక్టర్స్ కి కొత్త సలహాలు ఇస్తున్నారు.


కాగా పరుచూరి గోపాలకృష్ణ ఫ్యామిలీకి ఘట్టమనేని ఫ్యామిలీకి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఫ్రెండ్ షిప్ ఈ కాలం నాటిది కాదు . ఆ అనుబంధం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తుంది . కాగా రీసెంట్గా మహేష్ బాబు అమ్మగారు ఇందిరా దేవి గారు మరణించిన టైంలో ఆయన ఊర్లో లేకపోవడం ..ఈ క్రమంలోనే ఆమె ఆఖరి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇందిరా దేవి సంస్మరణ సభకు హాజరైన ఆయన అక్కడ పరిస్థితులను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా జనాలకు చ్ప్పుకొచ్చాడు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ..”ఘట్టమనేని ఫ్యామిలీతో నాకున్న అనుబంధం ఈనాటిది కాదు. అది చాలా సంవత్సరాల నుంచి చెరగని బంధంగా కొనసాగుతూ వస్తుంది. దాని గురించి మీకు తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మహేష్, కృష్ణ, రమేష్ బాబు, ఆదిశేషగిరిరావు.. వీరందరితో నాకు విడతీయరాని అనుబంధం ఉంది. వాళ్ళ కుటుంబం మా కుటుంబం మంచిగా కలిసిపోతాం. ఎన్నో ఏళ్ల నుంచి మాకు మంచి అనుబంధ ఉంది. కాగా నేను అమెరికా నుంచి వచ్చే లోపే మహేష్ బాబు అమ్మగారు ఇందిరాదేవి మరణించారు. ఏకదశి దినాన కృష్ణ గారిని చూస్తే నా గుండె తరుక్కుపోయింది .మరీ ముఖ్యంగా మహేష్ బాబును చూసినప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.

ఇన్నేళ్ల పరిచయంలో ఏనాడు మహేష్ బాబుని ఎలా చూడలేదు, బాగా డల్ గా.. డీలా పడిపోయి.. అమ్మగారు లేరన్న బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు. అమ్మగారు లేరు అని వార్త నుంచి ఇంకా బయటపడలేదు. తల్లి జ్ఞాపకాలతో మహేష్ బాబు పెదాలపై చిరునవ్వు మిస్ అయింది.ఇన్నేళ్ల నా సినీ కెరియర్లో మహేష్ బాబుని ఎప్పుడు నేను అలా చూడలేదు. తనకి కోపం వచ్చినా కానీ మహేష్ బాబు పెదాలపై చిరునవ్వు ఎప్పుడూ అలానే ఉంటుంది. కానీ ఫస్ట్ టైం మహేష్ బాబుని అలా చూసేసరికి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news