సినీరంగంలో తనదైన శైలిలో దూసుకుపోయిన అన్నగారు ఎన్టీఆర్‌కు నిజ జీవితంలో అనేక సవాళ్లు వచ్చా యి. సినీ ఫీల్డ్‌లో మకుటం లేని మహారాజుగా అన్నగారు ఒక వెలుగు వెలిగారు. అంతేకాదు.. అనేక మందికి కూడా..లైఫ్ ఇచ్చారు. ఎంతో మంది కళాకారులతో సంఘాలు కూడా ఏర్పాటు చేయించి.. వేతనంపై పోరాటాలు చేయించారని గుమ్మడి వెంకటేశ్వరరావు రాసుకున్నారు. అయితే.. ఒక విషయంలో ఎన్టీఆర్‌పై తీవ్రమైన ఒత్తడి వచ్చింది. కానీ, ఆయన ఆవిషయానికి చెయ్యి అడ్డు పెట్టారట.
ఈ విషయంపై.. గుమ్మడి.. సుదీర్ఘంగా తను రాసిన తీపి గురుతులు.. చేదు జ్ఞాపకాలు.. పుస్తకంలో రాసుకొ చ్చారు. 1980లలో ఎన్టీఆర్ మదిలో రాజకీయ పార్టీ పెట్టాలనే తలంపు వచ్చింది. ఈ విషయంలో ఒక పత్రికాధినేత నిత్యం ఆయనను కలుసుకునే వారట. అప్పటికి.. అన్నగారు.. చెన్నై (అప్పటి మద్రాసు)లో నే ఉన్నారట. అప్పటికి అన్నగారికి దాదాపు 60 ఏళ్లు వచ్చేశాయి. అయితే.. ఈ వయసులో పార్టీ పెడితే.. ఫాలో అయ్యేవారు ఎవరని ఆయన ప్రశ్నించేవారట.
ఈ క్రమంలో సదరు పత్రికాధినేతతో పాటు..కొందరు అన్నగారి సామాజిక వర్గానికి చెందిన వారు.. మీరు పార్టీ పెట్టండి.. సినిమా రంగం నుంచే బోలెడు మంది వచ్చి పార్టీలో చేరతారు.. అని సలహా ఇచ్చారట. అనుకున్న విధంగా అన్నగారు.. 1982-83 మధ్య పార్టీ పెట్టారు. అయితే.. పార్టీ పెట్టినా.. అప్పటి కాంగ్రెస్ నేతల ప్రభావంతో సినీమా రంగం నుంచి ఎవరూ పార్టీలో చేరలేదు. పైగా బ్రహ్మానందరెడ్డి వంటివారు.. సినీమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ను పట్టించుకుంటే.. తమకు ఇబ్బందులు తప్పవని భావించారట.
దీంతో ఎవరూపార్టీలో చేరలేదు. దీంతో ఇదే విషయాన్ని అన్నగారు.. సదరు పత్రికాధినేత ముందు పెట్టారు. “మీరేమో.. పార్టీ పెట్టగానే వాళ్లు వస్తారు.. వీళ్లు వస్తారు.. అని చెప్పారు. ఎవరూ రాలేదు.. ఇప్పుడు ఏం చేద్దాం?“ అని ప్రశ్నించారట. దీనికి ఆయన మీరే వారి వారి ఇళ్లకు వెళ్లి అడగండి.. అని ఉచిత సలహా ఇచ్చారట. అయితే.. ప్రాణం పోయినా ఆపని చేయనని ఎన్టీఆర్ తెగేసి చెప్పడంతో.. చైతన్య రథంలో ప్రజల మధ్యకు వెళ్లాలని సలహా ఇచ్చారట. ఇలా.. ఎన్టీఆర్..ప్రజల మధ్యకు వచ్చారు తప్ప.. తన ఆత్మాభిమానాన్నిమాత్రం చంపుకోలేదని.. గుమ్మడి వివరించారు.