జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. ఎన్నో సంచలనాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఆరు వరుస హిట్లు కొట్టినా కూడా ఫ్యాన్స్‌కు ఎందుకో మజా రావడం లేదు. ఫ్యాన్స్‌ను బాగా ఊసూరు మనిపిస్తున్నాడు. ఇందుకు కారణం గత కొన్నేళ్లలో ఎన్టీఆర్ సినిమాలు స్పీడ్‌గా రావడం లేదు.
2018 చివర్లో అరవింద సమేత వీరరాఘవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఎన్టీఆర్ డైరీలో 2019 – 2020 – 2021 సంవత్సరాలు ఒక్క సినిమా కూడా రాకుండా ఖాళీగా ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్ కెరీర్ స్టార్ట్ అయ్యాక ఒక్క 2009 క్యాలెండర్ ఈయర్ మాత్రమే ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా ఖాళీగా ఉంది.
ఇక త్రిబుల్ ఆర్ కోసం రాజమౌళి మూడేళ్ల పాటు ఎన్టీఆర్‌ను బ్లాక్ చేసేయడం ఒక మైనస్ అయితే.. మధ్యలో కరోనా రావడం కూడా ఎన్టీఆర్ కెరీర్‌లో ఏకంగా వరుసగా మూడేళ్లు ఖాళీగా ఉండేలా చేసింది. ఎన్టీఆర్ అదుర్స్ 2009లో రావాలి… అయితే ఆ యేడాది ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో అదుర్స్ 2010 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ తర్వాత రీసెంట్‌గా వరుసగా మూడేళ్లు తన క్యాలెండర్ ఇయర్‌ను ఖాళీగా ఉంచేశాడు. సరే ఈ యేడాది ట్రిపుల్ ఆర్ తర్వాత అయినా వరుసగా సినిమాలు చేస్తాడా ? అనుకుంటే ఇప్పటికే ఆరు నెలలకు పైగా ఖాళీగా ఉన్నాడు. కొరటాల సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో తెలియడం లేదు. ఇలా అయితే వచ్చే యేడాది ప్రారంభంలో కూడా ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. ఇంత లాంగ్ గ్యాప్ తీసుకుని… ఫ్యాన్స్‌ను ఊసూరుమనిపించడం ఎన్టీఆర్ కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైం.
ఇక గతంలో 2007 నుంచి 2010 వరకు మహేష్ బాబు లాంగ్ గ్యాప్ తీసుకుని ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్‌మెంట్ చేశాడు. రామ్‌చరణ్ కూడా 2019లో సంక్రాంతికి వచ్చిన వినయవిధేయ రామ తర్వాత 2020 – 2021 ఖాళీ తర్వాత 2022లో మాత్రమే త్రిబుల్ ఆర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ కూడా 2001లో ఖుషీ తర్వాత 2003లో జానీతో మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక 2009లో జల్సా తర్వాత మళ్లీ 2010లో కొమరంపులి వరకు ఖాళీగానే ఉన్నాడు.