మెగా అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశగా ఎదురుచూసిన సినిమా “గాడ్ ఫాదర్”. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన “లూసిఫర్” అనే సినిమాకి ఇది రీమేక్. మోహన్ రాజా తనదైన స్టైల్ లో ఈ సినిమాను తెరకెకించారు. ఈ సినిమాలో చిరంజీవి మెయిన్ లీడ్ పాత్రలో కనిపించగా సత్యదేవ్, నయనతార ప్రముఖ పాత్రలో కనిపించి అభిమానులను మెప్పించారు. ఈ సినిమాలో హీరోయిన్ లేనప్పటికీ మొదటి నుంచి అందరి కాన్సన్ట్రేషన్ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార పైనే ఉండింది,
నయనతార ఓ కథను నమ్మి ఒప్పుకుంది అంటే ఆ కథలో కచ్చితంగా ఏదో తెలియని ఓ మెసేజ్ ఉంటుందని జనాల అభిప్రాయం. కాగా గాడ్ ఫాదర్ విషయంలో నయనతార లెక్క తప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలు ఫస్ట్ ప్రీమియర్ టాక్ బయటకు వచ్చేసింది. గాడ్ ఫాదర్ సినిమా లో నయనతార క్యారెక్టర్ పెద్దగా చెప్పుకోదగ్గ విధంగా లేదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి మలయాళం లో కథ మొత్తం ఆ అమ్మాయి పైన నడుస్తుంది. కానీ తెలుగులో వచ్చేసరికి మోహన్ రాజా మెగాస్టార్ ని హైలైట్ చేస్తూ నయనతారను తగ్గించేశాడు. దీంతో నయనతార సినిమాలో బిస్కెట్ రోల్ అయింది.
అయితే నయనతార ఈ సినిమా కోసం షాకింగ్ కండిషన్లు పెట్టింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఇలాంటి సినిమా కోసం నయనతార కళ్ళు చెదిరే పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తుంది . అంతే కాదు ఇప్పటివరకు తెలుగులో ఆమె తీసుకున్న పారితోషకంలో ఇదే హైయెస్ట్ రికార్డ్ అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నయనతార ఏకంగా ఏడు కోట్లు తీసుకున్నట్లు సమాచారం. దీంతో నయనతార మరో సంచలన రికార్డు నెలకొల్పింది. సిస్టర్ రోల్ లో చేసి ఏడు కోట్లు తీసుకుంటున్న హీరోయిన్గా నయనతార క్రేజీ రికార్డ్‌ను క్రియేట్ చేసింది.