పెళ్లి చేసుకున్న తర్వాత భర్తే తన సర్వస్వం అంటూ భర్త కోసం ప్రాణాలు ఇచ్చే భార్యలు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి మంచి మనసు ఉన్న అమ్మాయిలలో నయనతార కూడా ఒకరు అంటూ చెప్పుకొస్తున్నారు ఆమె అభిమానులు . మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకునే నయనతార ఈ మధ్యనే తాను ప్రేమించి కొంతకాలం డేటింగ్ చేసిన డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ని పెద్దలను ఒప్పించి మరి మహాబలిపురంలోని ఓ రిసార్ట్లో గ్రాండ్ గా వెడ్డింగ్ చేసుకుంది . ఆమె పెళ్లి టైంలో నయనతారకు విగ్నేష్ శివన్ కు సంబంధించిన ఫోటోలు ఏ రేంజ్ లో వైరల్ గా మారయో తెలిసిందే. ఒక్క ఫోటో బయటకు రానికుండా జాగ్రత్త పడిన వీళ్లిద్దరూ స్వయంగా అభిమానుల కోసం వాళే పెళ్లి ఫోటోలు రిలీజ్ చేశారు.
అయితే పెళ్లి తర్వాత నయన్ మాత్రం భర్తను వదలకుండా ప్రతిక్షణం తనతోనే ఉంటూ ఎంజాయ్ చేస్తుంది . ఇప్పటికే రెండు హనీమూన్లు కంప్లీట్ చేసుకున్న ఈ జంట త్వరలోనే మూడో హనీమూన్ కూడా ప్లాన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే రీసెంట్గా కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. నయనతార విగ్నేశ్ శివన్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలి అన్న నిర్ణయానికి వచ్చిన నయనతారను ..విగ్నేష్ ఒప్పించి మరి సినిమాలు చేయిస్తున్నాడట.
అయితే రీసెంట్ గా విగ్నేష్ శివన్ అమ్మగారు నయబ్ ని ఓ కోరిక కోరిందట .”అందరు హీరోయిన్స్ ల నువ్వు కూడా పెళ్లి తర్వాత ఐదు ఆరేళ్ల గ్యాప్ తీసుకొని పిల్లల్ని కనకు..సంవత్సరం తిరిగేసరికి నా చేతిలో పండు లాంటి బిడ్డను పెడితే నేను చాలా సంతోషంగా ఉంటాను. కోడలుగా ఇది నువ్వు నాకు ఇస్తున్న గిఫ్ట్ అని అనుకో” అంటూ ఎమోషనల్ గా చెప్పిందట. ఈ మాటలకి మెల్ట్ అయిపోయిన నయనతార సినిమాలకన్నా నాకు ప్రజెంట్ బిడ్డలే ముఖ్యం అంటూ.. ప్రెగ్నెన్సీ ని ప్లాన్ చేసుకుంటుందట. అంతేకాదు ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను కంటిన్యూ చేసి ..ఇక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తుందట . అయితే నిర్మాణరంగం వైపు మాత్రం ఆమె ఇంట్రెస్ట్ చూయిస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి తనకిష్టమైన పనిని వదులుకోవడం ఏ ఆడపిల్లకి ఇష్టం ఉండదు, కానీ భర్త కోసం భర్త ఇంటి పేరు కోసం నయనతార చేస్తున్న ఈ త్యాగం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.